
రేవతిలా యాక్ట్ చేయమనే వాళ్లు
ఎంత పెద్ద నటీనటులైనా తమకు నచ్చిన సినీ తారల నటనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తెరపై ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కొంతమందిని అనుకరిస్తూ ఉంటారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్‌గా వెలుగుతున్న సమంత తాను మంచి నటిగా కొనసాగడానికి కారణం రేవతి అన్నారు. ఇటీవల రేవతితో కలిసి సమంత ఓ యాడ్‌లో నటించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ -‘‘ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో అవకాశం రాకముందు నేను కొన్ని ఆడిషన్స్‌లో పాల్గొన్నా.
సెలెక్ట్ కాలేదు. చాలా బాధపడ్డాను. కొంతమంది దర్శకులు నన్ను రేవతిలా యాక్ట్ చేయమని అనేవాళ్లు. ఆవిడ నటించిన సినిమాలు చూపించేవాళ్లు. నాకు ఇష్టమైన నటి రేవతి. ఆమె సినిమాలంటే చాలా ఇష్టం. ఆమెను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. అద్దం ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. రేవతిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని నా శైలిలో నటించడం మొదలుపెట్టాను’’ అని చెప్పుకొచ్చారు.