రోహన్ సిద్ధార్థ, చైతన్య ప్రియ
‘జయం’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తుగ్లక్’. రోహన్ సిద్ధార్థ, చైతన్య ప్రియ జంటగా బ్రహ్మానందం, చలపతిరావు, ‘సత్యం’ రాజేష్, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా గీతా టాకీస్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రణీత్ పండగ మాట్లాడుతూ– ‘‘మంచి లవ్ ఫీల్ కలిగిన స్టోరీతో ఉత్కంఠగా సాగే కథనంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తి కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ‘తుగ్లక్’ పాత్రను ఓ ప్రముఖ నటుడు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలోని పాటలను ఇటీవల కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కించాం. పరమగీతగారి ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగే ఆఖరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పరమ గీత, సహ నిర్మాతలు: గిరి, రజని, కెమెరా: రాహుల్ మాచినేని, సంగీతం: మహేష్ ధీర.
Comments
Please login to add a commentAdd a comment