
ఎందులో? ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహర్ కాలేజ్‌లో! వచ్చే ఏడాది (2018) కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తామని కరణ్ అనౌన్స్ చేశారు. బట్, టైగర్ ష్రాఫ్‌కి ఆల్రెడీ అడ్మిషన్ ఇచ్చేశారు. ఈ యంగ్ హీరోకి ఓ సీట్ కన్ఫర్మ్ చేశారు! నెక్ట్స్ ఎవరికి (హీరోయిన్) అడ్మిషన్ ఇస్తారో మరి? కరణ్ జోహార్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ వైఫ్ గౌరి, కరణ్ మదర్ హీరూ యశ్‌జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. అయితే... దీనికి కరణ్ దర్శకుడు కాదు, నిర్మాత మాత్రమే.
పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2’లో టైగర్ ష్రాఫ్ హీరో. సారా అలీఖాన్, దిశా పాట్నీ, అనన్యా పాండేల పేర్లు హీరోయిన్ల రేసులో వినబడుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికి కాలేజ్‌లో సీట్ ఇస్తారో!! ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, ఆలియా భట్ నటించారు. ఇప్పుడు వాళ్లందరూ హిందీలో క్రేజీ స్టార్స్. టైగర్ ష్రాఫ్ కూడా క్రేజీ స్టారే. అయితే... కరణ్ జోహార్ సంస్థలో సినిమా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ సిన్మాలు చేసిన టైగర్, స్టూడెంట్‌గా ఎలా నటిస్తారోననే ఆసక్తి హిందీ ప్రేక్షకుల్లో నెలకొంది!!
Comments
Please login to add a commentAdd a comment