
బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్.
యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ లు వేణు మాధవ్ మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. వేణుమాధవ్‌తో సన్నిహితంగా ఉండే కమెడియన్లు అలీ, ఉత్తేజ్‌లు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే వేణు మాధవ్ లేడంటే నమ్మలేకపోతున్నా అంటూ సీనియర్ నటుడు గౌతమ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment