
నాతిచరామి
తెలుగువారి మనసు దోచే మెగా సీరియల్స్‌తో వినోదాన్ని అందించే జెమిని టీవీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెగా సీరియల్ ‘నాతిచరామి’. ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రపంచంలో సితారగా వెలుగొందిన భానుప్రియ, విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సురేశ్ ప్రధాన పాత్రలుగా ఈ సీరియల్ జెమిని టీవీలో ప్రసారం అవుతోంది.
భార్యాభర్తల అద్భుత మైన బంధానికి దృశ్య రూపం ఇస్తూ, ఒక ఆవేశ పూరితమైన నిర్ణయం వల్ల రెండు జీవితాల్లో ఎలాంటి సంఘర్షణలు రేగాయి? అనే కథనం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మీ మనసుల్ని దోచుకోవటానికి వస్తోంది ‘నాతిచరామి’.. సోమ - శుక్ర రా.7 గం॥మీ జెమిని టీవీలో....