
మాజీ భర్తపై కేసు పెట్టిన నటి
బిగ్బాస్ స్టార్ దీప్శిఖా నాగ్ పాల్, మాజీ భర్త. నటుడు కేశవ్ అరోరాపై గృహహింస కేసు నమోదు చేసింది
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మాకపూర్ దంపతుల వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో సినీ, టీవీనటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. బిగ్బాస్ స్టార్ దీప్శిఖా నాగ్ పాల్ తన మాజీ భర్త, నటుడు కేశవ్ అరోరాపై గృహహింస కేసు పెట్టింది. తనపై భౌతికంగా దాడి చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2012 లో వివాహం చేసుకున్న ఈ జంట మనస్పర్దల కారణంగా ఇటీవల విడాకులు తీసుకుంది. ఇంతలోనే మళ్లీ రచ్చకెక్కడం చర్చకు దారి తీసింది.
విడాకుల తర్వాత అతనిలో మార్పు వస్తుందనుకున్నా.... కానీ అలాజరగలేదని దీప్సిఖ మీడియాకు తెలిపింది. మహిళా దినోత్సవం రోజు తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపించింది. దాన్నిసహించడం తన వల్ల కాదని పేర్కొంది. ఈ విషయంలో తాను మౌనంగా వుంటే.. మిగతా మహిళల పరిస్థితి ఏంటని దీప్సిఖ ప్రశ్నించింది. అందుకే ఫిర్యాదు చేశానంది. తనకు న్యాయ కావాలని కోరుతోంది. రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది.. కాగా బాలీవుడ్ లో పార్టనర్, కార్పొరేట్ లాంటి సినిమాల్లో నటించింది. నటుడు జీత్ ఉపేంద్ర ను పెళ్లి చేసుకున్న10 సంవత్సరాల తర్వాత 2007 లో విడిపోయారు.