ప్లీజ్.. ఈ సినిమాను ఆన్లైన్లో చూడకండి | 'Udta Punjab' beautiful film, online leak a tragedy: Katrina | Sakshi
Sakshi News home page

ప్లీజ్.. ఈ సినిమాను ఆన్లైన్లో చూడకండి

Published Fri, Jun 17 2016 5:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ప్లీజ్.. ఈ సినిమాను ఆన్లైన్లో చూడకండి - Sakshi

ప్లీజ్.. ఈ సినిమాను ఆన్లైన్లో చూడకండి

ముంబై: బాలీవుడ్ తాజా చిత్రం ఉడ్తా పంజాబ్కు అద్భుతంగా ఉందని నటి కత్రినా కైఫ్ ప్రశంసించింది. గురువారం రాత్రి కత్రినా ఈ సినిమా స్పెషల్ షో చూసింది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం బాధాకరమని చెప్పింది. అభిమానులు ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని, ఆన్లైన్లో చూడవద్దంటూ కత్రినా కోరింది.

ఉడ్తా పంజాబ్లో షాహిద్ కపూర్, అలియా భట్ అద్భుతంగా నటించారని కత్రిన కితాబిచ్చింది. ఈ సినిమా చాలా బాగుందని, దర్శకుడు ఎంచుకున్న కథకు న్యాయం చేశాడని చెప్పింది. ఈ సినిమాలో షాహిద్ రాక్ స్టార్గా నటించగా, అలియా బిహార్ నుంచి వలసవచ్చి హాకీ క్రీడాకారిణిగా ఎదగాలన్న యువతిగా నటించింది. ఈ సినిమా విడుదల విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 89 కట్లు వేయగా, చిత్ర బృందం హైకోర్టును ఆశ్రయించింది. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఒకే కట్తో ఈ సినిమా విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement