అడవిలో ప్రేమ | Vijay Chowdary Tripuraneni new movie with Thela Ramesh | Sakshi
Sakshi News home page

అడవిలో ప్రేమ

Published Fri, Jun 19 2020 5:53 AM | Last Updated on Fri, Jun 19 2020 5:53 AM

Vijay Chowdary Tripuraneni new movie with Thela Ramesh - Sakshi

విజయ్‌ చౌదరి త్రిపురనేని

‘కవ్వింత’ చిత్రంతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు విజయ్‌ చౌదరి త్రిపురనేని. ద్వితీయ ప్రయత్నంగా ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫైవ్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తేళ్ల రమేష్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. విజయ్‌ చౌదరి త్రిపురనేని మాట్లాడుతూ– ‘‘అడవి నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. లవ్, యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఒక యంగ్‌ హీరో నటిస్తారు’’ అన్నారు. ‘‘విజయ్‌ చౌదరి చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు తేళ్ల రమేష్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement