Vijay Choudhary
-
అడవిలో ప్రేమ
‘కవ్వింత’ చిత్రంతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు విజయ్ చౌదరి త్రిపురనేని. ద్వితీయ ప్రయత్నంగా ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తేళ్ల రమేష్ ఈ సినిమా నిర్మించనున్నారు. విజయ్ చౌదరి త్రిపురనేని మాట్లాడుతూ– ‘‘అడవి నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. లవ్, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో ఒక యంగ్ హీరో నటిస్తారు’’ అన్నారు. ‘‘విజయ్ చౌదరి చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు తేళ్ల రమేష్. -
కవ్వించే ప్రేమ
‘‘ఫేక్ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన ఊరిలో జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఫొటోగ్రఫీ, సంగీతం ఇందులో హైలైట్’’ అన్నారు దర్శకుడు త్రిపురనేని విజయ్ చౌదరి. అంజనీ మూవీస్‌పై విజయ్ దాట్ల, దీక్షాపంత్ జంటగా పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ‘కవ్వింత’ ఈ నెల 8న విడుదల కానుంది. ‘‘ప్రాంతాల వారీగా ఈ చిత్రాన్ని సేల్ చేశారు. లాభనష్టాలను అందరూ సమానంగా పంచుకోవాలనే నూతన పద్ధతిని అనుసరిస్తుండటం మంచిదే’’ అని మల్టీ డెమైన్షన్ వాసు అన్నారు. హీరో విజయ్, త్రిపురనేని చిట్టి, ధన్‌రాజ్, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, శ్యాం తుమ్మలపల్లి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరిప్రకాష్ నంది, సహ నిర్మాత: తెంటు లక్ష్ము నాయుడు. -
అసెంబ్లీ నూతన స్పీకర్‌గా చౌదరి
పాట్నా : బిహార్ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా జేడీ(యూ) సీనియర్ నేత విజయ కుమార్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ బుధవారం పాట్నాలో వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్‌గా విజయకుమార్ చౌదరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని సదానంద్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. సమస్తీపూర్ జిల్లా సరాయిరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ కుమార్ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్, ప్రతిపక్ష నేత ప్రేమకుమార్... విజయ్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ చౌదరి గతంలో మంత్రిగా కూడా పని చేశారు. -
వినూత్న పద్ధతిలో విడుదల
విజయ్ భట్ల, దీక్షాపంథ్ జంటగా రూపొందిన చిత్రం ‘కవ్వింత’. విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకుడు. పువ్వుల శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కాశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న సూపర్‌స్టార్ కృష్ణ, రాజశేఖర్ దంపతులు, మంత్రి అయ్యన్న పాత్రుడు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దంపతులు, గిరిబాబు, భీమినేని శ్రీనివాసరావు, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, ‘మల్టీడైమన్షన్’ వాసు, విజయ్‌కుమార్ కొండా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఓ వినూత్న పద్ధతితో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. హృదయాలను తాకే ఈ ప్రేమకథలో యువతరం మెచ్చే అంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
తాతయ్య మహారథి బాటలోనే...
సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు, దర్శక, నిర్మాత త్రిపురనేని చిట్టి తనయుడు విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘కవ్వింత’. విజయ్ దాట్ల, దీక్షా పంత్, ధన్‌రాజ్, త్రిపురనేని చిట్టి, ఎల్బీ శ్రీరామ్ ముఖ్య తారలు. పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం మేకింగ్ వీడియోను ‘మల్టీ డైమన్షన్’ వాసు ఆవిష్కరించారు. ఈ వేడుకలో దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీరశంకర్, రవికుమార్ చౌదరి, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ అధినేతలు నేరుగా కొనుక్కునే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ శ్రీకన్య థియేటర్ అధినేత వీవీ సత్యనారాయణరాజు ఈ చిత్రాన్ని లక్ష రూపాయలకు కొనుక్కున్నారు. ఈ సమావేశంలో త్రిపురనేని చిట్టి మాట్లాడుతూ -‘‘దర్శకుడు కావాలనే తన ఆకాంక్షను నేర్చుకోవడానికి విజయ్ ముందు దర్శకత్వ శాఖలో చేరాడు. అనుభవం సంపాదించాకే డెరైక్టర్ అయ్యాడు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు 22 థియేటర్స్‌కి ఈ సినిమా అమ్ముడుపోయింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాలు చేయడంలేదు. ఈ సినిమా తర్వాత నేనే సినిమా చేసినా, నెల జీతానికే చేస్తాను. నిర్మాత శ్రేయస్సు నాకు ముఖ్యం. మా తాతగారు, నాన్నగార్ల బాటలోనే వెళ్లాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ మా ‘అంజని ఫౌండేషన్’ ద్వారా జరిపే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: టెంటు లక్ష్ము నాయుడు.