అసెంబ్లీ నూతన స్పీకర్గా చౌదరి | Vijay Choudhary elected speaker of Bihar assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ నూతన స్పీకర్గా చౌదరి

Published Wed, Dec 2 2015 1:58 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

Vijay Choudhary elected speaker of Bihar assembly

పాట్నా :  బిహార్ అసెంబ్లీ నూతన స్పీకర్గా జేడీ(యూ) సీనియర్ నేత విజయ కుమార్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ బుధవారం పాట్నాలో వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్గా విజయకుమార్ చౌదరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని సదానంద్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన స్పీకర్గా ఎన్నికయ్యారని తెలిపారు.

సమస్తీపూర్ జిల్లా సరాయిరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ కుమార్ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్, ప్రతిపక్ష నేత ప్రేమకుమార్... విజయ్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ చౌదరి గతంలో మంత్రిగా కూడా పని చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement