విజయ్ భట్ల, దీక్షాపంథ్ జంటగా రూపొందిన చిత్రం ‘కవ్వింత’. విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకుడు. పువ్వుల శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కాశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న సూపర్‌స్టార్ కృష్ణ, రాజశేఖర్ దంపతులు, మంత్రి అయ్యన్న పాత్రుడు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దంపతులు, గిరిబాబు, భీమినేని శ్రీనివాసరావు, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, ‘మల్టీడైమన్షన్’ వాసు, విజయ్‌కుమార్ కొండా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఓ వినూత్న పద్ధతితో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. హృదయాలను తాకే ఈ ప్రేమకథలో యువతరం మెచ్చే అంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
వినూత్న పద్ధతిలో విడుదల
Published Thu, Dec 25 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement