
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈసినిమా ఘన విజయం అనంతరం విజయ్ తరువాతి సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్ కొట్టిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
రొటీన్ సినిమాలకు, కమర్షియల్ సినిమాల కన్నా, ఏదైనా కొత్తదనం ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తానని విజయ్ గతంలోనే తెలిపాడు. అయితే అర్జున్ రెడ్డి మనసులో మాత్రం ఓ కోరిక ఉంది. ఒక మంచి యాక్షన్ తరహాలో గ్యాంగ్‌స్టర్ సినిమాను చేయాలని ఉందట. ఇటీవల ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకకు అతిథిగా వెళ్లిన విజయ్ మనసులోని కోరికను చెప్పాడు.
విజయ్ - పరశురామ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న రష్మీక మందాన, గణేష్ సరసన చమక్ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. ఈ ఆడియో వేడుకలో పాల్గొన్న విజయ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్‌ని చూసి తనకు కూడా అలాంటి గ్యాంగ్‌స్టర్ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించాలని ఉందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment