
రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ లోమోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు యువ నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో చేతి నిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ ట్రావెల్ డ్రామాలో నటిస్తున్న ఈ విజయ్ ఈ సినిమాతో పాటు మహానటి షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈరెండు సినిమాల తరువాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న నోటా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు.
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం వర్మ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా విజయ్, వర్మ సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ మరికొన్ని సినిమాలను ఇప్పటికే ప్రకటించాడు.