
మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అవుతున్న మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ మేనల్లుడిగా.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇస్తున్నాడు వైష్ణవ్. అందుకే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. అందుకే పాత్రల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడట.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి లో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్, చిరు కోరిక మేరకే వైష్ణవ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాను సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.