
లక్ష్మణ్ క్యాదరి, పూరి జగన్నాథ్
‘‘వినరా సోదర వీరకుమారా!’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. దర్శకుడు సతీష్‌కి ఇది మొదటి సినిమా. కథ మొత్తం నాకు చెప్పాడు. చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ జంటగా సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మించిన చిత్రం ‘వినరా సోదర వీరకుమారా!’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పూరి జగన్నాథ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ తరం యూత్‌కి కావాల్సిన సినిమా ఇది. సతీష్ కథ చెబుతుంటే నాకు సినిమా మొత్తం కనిపించింది.
అంత చక్కగా చెప్పాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. సతీష్ చంద్ర చక్కగా తీర్చిదిద్దాడు. ఫస్ట్ కాపీ రెడీ అయింది. శ్రవణ్ భరద్వాజ్ మంచి పాటలు ఇచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అని లక్ష్మణ్ క్యాదరి అన్నారు. ఉత్తేజ్, ఝాన్సీ, సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: రవి. వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనీల్ మైలాపురం.
Comments
Please login to add a commentAdd a comment