భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌ | Vithika Sheru May Eliminate From Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

వితిక ఎలిమినేట్‌ కానుందా?

Published Sat, Aug 3 2019 5:17 PM | Last Updated on Sat, Aug 3 2019 6:27 PM

Vithika Sheru May Eliminate From Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి రెండో వ్యక్తి బయటకు వెళ్లే తరుణం వచ్చేసింది. రెండో వారానికి నామినేట్‌ అయిన రాహుల్‌, జాఫర్‌, శ్రీముఖి, మహేష్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, పునర్నవిలో వరుణ్‌ కెప్టెన్‌గా ఎన్నికైనందున.. ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉండదు. మిగిలిన ఏడుగురిలోంచి ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే ఆ ఒక్కరు ఎవరనేది హౌస్‌మేట్స్‌లో ఉన్నవారికే కాకుండా బిగ్‌బాస్‌ వీక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఆ ఏడుగురిలోంచి వితికా షెరు, జాఫర్‌లు ఎలిమినేట్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం వితికా ఎలిమినేట్‌ కానుందని తెలుస్తోంది. స్వార్థంగా ఆలోచిండం, తన భర్త కోసం మాత్రమే పనులు చేయడం, అందరితోనూ కలవలేకపోవడం.. బయటకు వచ్చిన హేమ సైతం వితికాపై ఆరోపణలు చేయడం.. ఇలా ప్రతీ విషయంలోనూ వితికాకు నెగెటివిటీ పెరిగిపోతోంది. దీంతో ఈసారి ఎలిమినేషన్‌కు గురయ్యేది వితికానే అని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ జంటను పంపించి.. వారితో గొడవలు పెట్టించి టీఆర్పీ పెంచుకుందామని చూశారని మొదట్నుంచీ ఓ టాక్‌ వినిపించింది. అందుకే వరుణ్‌ సందేశ్‌, వితికా షెరులను కంటెస్టెంట్లుగా తీసుకున్నారనే కామెంట్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వారంలో వితిక ఎలిమినేట్‌ అయితే.. వారిద్దరి రొమాన్స్‌కు చెక్‌ పడనుంది. రెండో వారానికి గానూ ఇద్దరూ నామినేషన్స్‌లో ఉండగా.. కెప్టెన్సీ పదవితో వరుణ్‌ ఈ గండం నుంచి గట్టెక్కాడు. ప్రైవేట్స్‌ పోల్స్‌ను బట్టి చూస్తే వితిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం వితిక నిజంగానే ఎలిమినేట్‌ అవుతుందా? తన అదృష్టం బాగుండి మరేవరైనా బయటకు వెళ్లిపోతారా? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement