పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు | we can marry any time : anushka | Sakshi
Sakshi News home page

పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు

Published Sat, Jan 4 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు

పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు

పెళ్లనేది ఎప్పుడైనా చేసుకోవచ్చని, మంచి చిత్రాల అవకాశాలు మళ్లీ రావని నటి అనుష్క పేర్కొంది. అందుకే పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకున్నానని తెలిపింది. తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా ప్రకాశిస్తున్న అనుష్కకు మూడు పదుల వయసు దాటింది. ఆ మధ్య అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టడం తో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు, వరుడి వేటలో ఉన్నట్లు ప్రకటించి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇటీవల మళ్లీ అవకాశాలు తలుపు తట్టడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుంది. ప్రస్తు తం ఈ బ్యూటీ తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చరిత్రాత్మక చిత్రాల్లో నటిస్తోంది. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకుందట. దీని గురించి ఈ యోగా సుందరి స్పందిస్తూ తన నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రం అరుంధతి అంది.
 
  ఆ చిత్రం తర్వాత మళ్లీ అంత గొప్ప పాత్ర లు పోషించే అవకాశం రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో లభించిందని పేర్కొంది. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని పేర్కొంది. పెళ్లనేది ఎప్పుడైనా చేసుకోవచ్చునని, మంచి చిత్రాల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తాయని చెప్పలేమని తెలిపింది. అందుకే పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు అనుష్క వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement