తీర్పు అనంతరం ఏం జరుగుతుంది? | What happens after the judgment? | Sakshi
Sakshi News home page

తీర్పు అనంతరం ఏం జరుగుతుంది?

Published Mon, Sep 16 2013 12:41 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

తీర్పు అనంతరం ఏం జరుగుతుంది? - Sakshi

తీర్పు అనంతరం ఏం జరుగుతుంది?

‘‘ప్రతి ఒక్కరినీ కదిలించిన ఢిల్లీ నిర్భయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పే సినిమా ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. 
 
 ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నిర్భయభారతం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మట్లాడుతూ - ‘‘ఇటీవలే నిర్భయ నిందితులకు కోర్టు మరణ దండన విధించింది. 
 
 ఈ తీర్పు అనంతరం ఏం జరుగుతుంది? అనేది మా సినిమా క్లైమాక్స్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సి.గోపాలరావు, కూర్పు: మోహన్ రామారావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement