ముచ్చటగా మూడోసారి! | with the combination of Samantha,Kajal ,Jyothika doing a movie | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి!

Published Wed, Feb 1 2017 11:45 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ముచ్చటగా మూడోసారి! - Sakshi

ముచ్చటగా మూడోసారి!

ఇప్పటివరకూ కాజల్‌ అగర్వాల్, సమంతలు రెండుసార్లు వెండితెరను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ పక్కన ‘బృందావనం’, మహేశ్‌బాబు పక్కన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో హీరోయిన్‌లుగా నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరూ కలసి నటిస్తున్నారు. తమిళ నటుడు విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్లుగా కాజల్‌ అగర్వాల్, సమంతలు నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక, దర్శకుడు ఎస్‌.జె. సూర్య, సత్యరాజ్‌లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సూర్యతో వివాహానంతరం ‘36 వయదినిలే’ సినిమాతో తమిళ తెరపై రీ–ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఇటీవలే మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రీ–ఎంట్రీలో ఆమె ఓ స్టార్‌ హీరో సినిమాకి సంతకం చేయడమిదే మొదటిసారి. ఇదిలా ఉంటే  విజయ్‌ హీరోగా ‘తేరి’ అనే సూపర్‌ కమర్షియల్‌ హిట్‌ మూవీ తీశారు అట్లీ. ఇప్పుడు తాజా చిత్రాన్ని కూడా అట్లీ భారీగానే ప్లాన్‌ చేశారట. ఇందులో జ్యోతిక–కాజల్‌–సమంతల పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement