నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే! | Writer Paruchuri Venkateswararao Birthday Special | Sakshi
Sakshi News home page

నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే!

Published Sun, Jun 22 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే!

నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే!

 ‘‘ఏ నిర్మాత అయినా మూటలతో వస్తాడు కానీ, వీఆర్ కన్నెగంటి మాత్రం మాటలతో వచ్చాడు. నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ వైవిధ్యభరితమైన ప్రేమకథాచిత్రంలో నేను బలరామయ్య పాత్ర పోషిస్తున్నాను’’ అని సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా కన్నెగంటి సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వంటి మహానటులతో పనిచేసిన పరుచూరి వెంకటేశ్వరరావు తమ సినిమాలో నటించటం పట్ల నిర్మాత ఆనందం వెలిబుచ్చారు. నాయకానాయికలను ఎంపిక చేసి, వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు రతన్ కాంబ్లే చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత ఠాగూర్ మధు, నటుడు కృష్ణమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement