బన్నీ, ఎన్టీఆర్, పవన్లను దాటిన నాని | Young Hero Nani crosses a milestone on Twitter | Sakshi
Sakshi News home page

బన్నీ, ఎన్టీఆర్, పవన్లను దాటిన నాని

Published Wed, Sep 14 2016 10:43 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బన్నీ, ఎన్టీఆర్, పవన్లను దాటిన నాని - Sakshi

బన్నీ, ఎన్టీఆర్, పవన్లను దాటిన నాని

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్నాడు. తన సినిమాల అప్ డేట్స్ను రెగ్యులర్గా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకునే నేచురల్ స్టార్, సోషల్ మీడియాలో మైల్ స్టోన్ను అందుకున్నాడు. పది లక్షల మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న ఈ సహజ నటుడు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

టాప్ స్టార్లుగా పేరున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల కన్నా నాని ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మజ్నుఈ నెల 23న రిలీజ్కు రెడీ అవుతోంది . అను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని సహాయ దర్శకుడిగా కనిపించనున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి అతిథి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద అంచనాలు  భారీగా ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement