సాక్షిప్రతినిధి, నల్లగొండ : పలు రకాల నేర ప్రవృత్తి ఉన్న వారి వివరాలు.. ఇంటికి వెళ్లి పోలీస్‌శాఖ సేకరిస్తోంది. సదరు నేరస్తులు వివరాలతోపాటు వేలి ముద్రలను తీసుకుంటోంది. జిల్లావ్యాప్తంగా పదేళ్లలో 11,143 మంది నేరస్తులున్నట్లు ఇప్పటికే గుర్తించారు. వీరి వివరాలు సేకరించేందుకు ప్రతి పోలీస్ అధికారి నుంచి ఎస్పీ వరకు మొత్తం 300 టీములు ఏర్పడ్డాయి. నేరస్తుల వివరాలు జియో ట్యాగింగ్, వేలి ముద్రలు తీసుకొని ఈ వివరాలను టీఎస్ కాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఒక నేరస్తుడి పేరును టీఎస్ కాప్‌లో క్లిక్ చేస్తే అతను ఎన్ని నేరాలు చేశాడో మొత్తం వివరాలు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆ శాఖ సిబ్బందికి తెలిసిపోతుంది. ఈ విధానంలో ప్రధానంగా పేర్లతోపాటు వేలిముద్రలు కీలకం కా నున్నాయి. గతంలో నేరస్తుల వేలి ముద్రలు సేకరించినా అవి ప్రస్తుతం సరి పోలకపోవడంతో ఒక కేసును చేధించడానికి పోలీసులకు చాలాకా లం పడుతోంది. జియోట్యాగింగ్‌కు అనుసంధా నం చేస్తూ టీఎస్‌కాప్‌తో అధునాత న టెక్నాలజీతో ఈ సర్వేలో నేరస్తుల వేలి ముద్రలు సేకరిస్తున్నారు. దీనికి సం బంధించి 120 ట్యాబ్స్ జిల్లాకు మం జూరయ్యాయి. నేరస్తుల సమాచారం కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో బీట్ కానిస్టేబుల్‌కి, ఐడీ పార్టీ టీం, ఇన్వెస్టిగేషన్ అధికారికి ట్యాబ్స్ ఇస్తారు. పోలీస్‌శాఖ నిధుల ద్వారా జిల్లాలో 823 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సకల నేరస్తుల సమగ్ర సర్వేతో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు 250 కెమెరాలను పలు కేంద్రాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు.
నేరాలను తగ్గించాలని ..
గతంలో నేరం చేసిన వారి వివరాలను ఈ సర్వేలో భాగంగా సేకరించి వాటిని తగ్గించాలని పోలీస్‌శాఖ ప్రయత్నిస్తోం ది. పదేళ్ల నేరస్తుల చిట్టా అంతా తీసి పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చే స్తుండడంతో.. పాత నేరస్తులకు గుండె గుబేల్‌మంటోంది. పోలీస్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి వివరాలు అడుగుతుండడంతో మళ్లీ ఏమైందోన ని పాత నేరస్తుల్లో ఆందోళన నెలకొంది. అయి తే వివరాలు సేకరించేందుకే వస్తున్నామని, ఎలాంటి భయాందోళనలు చెందవద్దని పోలీస్ సిబ్బంది వారికి చెబుతున్నారు. తొలుత ఆందో ళన చెందినా తర్వాత ఊపిరి పీల్చుకొ ని వివరాలన్నీ నమోదు చేయించుకుం టున్నారు. తొలిరోజే జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 వేల మంది నేరస్తుల వివరాలను పోలీస్ సిబ్బంది సేకరించారు. మరో మూడు రోజుల్లో మొత్తం వివరాల సేకరణ పూర్తి చేయనున్నారు. సమగ్ర సర్వేను ఎస్పీ డీవీ.శ్రీనివాసరావుతోపాటు డీఎ స్పీలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నిఘా నేత్రం ..
టీఎస్ కాప్ పోలీస్‌లకు కీలక నిఘా నేత్రంగా మారుతోంది. మిస్టరీగా మా రే కేసులకు సంబంధించి అనుమానుతులను తీసుకొచ్చి వేలిముద్రలు సేకరించి, అవి సరిపోలాయో లేదో చూ స్తారు. అలాగే జియో ట్యాగింగ్‌తో నేరస్తుడు ఇంటినుంచి ఏ సమయంలో బయటకు వెళ్లాడో కూడా తెలిసిపోనుండడంతో.. దాని అధారంగా ఇ లాంటి కేసులను పోలీస్ శాఖ సునా యసంగా చేధించనుంది. పాత నేరస్తుల ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేస్తుండడంతో ఎక్కడ ఏమైనా నేరం జరిగినా, లేక పరిసర ప్రాంతాల్లో ఏమైనా నేరం జరిగినా ముందుకు వీరి కదలికలను తీస్తారు. దీని ఆధారంగా పోలీస్ కాప్ వివరాలతో నేరస్తులను తక్కువ సమయంలో గుర్తిస్తారు. వివరాల సేకరణ సమయంలోనే పోలీసులు పాత నేరస్తులకు సంబంధించి ప్రతి అంశాన్నీ వదలిపెట్టడం లేదు. ప్రతిదీ సర్వేలో నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment