విద్యా, వైద్యరంగానికి కొత్త మెరుగులు : కలెక్టర్
‘‘ఈ ఏడాదిలో సాధించిన జయాపజయాలను బేరీజు వేసుకుంటూనే కొత్త ఏడాదిలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో మార్పులు తీసుకురాబోతున్నాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల పథకాల్లో అనుకున్న పురోగతిని సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా పనిచేసేందుకు పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోతాం’ అని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో చేపట్టబోయే ప్రధాన కార్యక్రమాల్లో విద్యా, వైద్యరంగానికి కొత్త మెరుగులు దిద్దేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్య లో కొత్త సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలు వెల్లడిం చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నల్లగొండ : ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడతాం. ఇప్పటికే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బ్లాకులు పెంచాం. కేసీఆర్ కిట్ల పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఇదే క్రమంలో వచ్చే ఏడాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించాం. జిల్లాలో కొన్ని పీహెచ్‌సీలను ఎంపిక చేసి మోడల్ హెల్త్ సెంటర్లుగా తీర్చిదిద్దుతాం. వాటిల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం.
ఆ తర్వాత విడతలవారీగా మిగిలిన కేంద్రాల్లో కూడా మార్పులు తీసుకొస్తాం. శిశుగృహలో చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణకు పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సహకారం కావాలని కోరుతున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారితో సంప్రదింపులు చేస్తున్నాం. ఒక్కో వైద్యుడు శిశుగృహలోని చిన్నారులను దత్తత తీసుకుని వైద్యసేవలు అందిస్తారు. పిల్లలు చనిపోవడం తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఇలాంటి తప్పులు పునారవృ తం కాకుండా అన్ని రకాల వసతులు శి శుగృహలో కల్పిస్తాం. ‘ఎక్స్‌ట్రా డాక్టర్ హెల్త్ కేర్’ అనే నినాదంతో చిన్నారుల ఆరోగ్యానికి కాపాడుకుంటాం.
పాఠశాలల్లో ‘బ్రైంట్ మైండ్స్’....
పాఠశాల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించేందుకు కొత్త ఏడాది ఆరంభంలోనే మార్పులు అమలు చేయబోతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాలో విజయవంతమైన బ్రైంట్ మైడ్స్ అనే ఏజెన్సీని రప్పించబోతున్నాం. నా బ్యాచ్‌మెంట్స్‌లో కొందరి సలహామేరకు బ్రైంట్ మైడ్స్‌ను జిల్లాలకు ఆహ్వానించాం. విద్యార్థులు కేవలం ఒకటి, రెండు రంగాలపై దృష్టి సారిస్తున్నారు. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వాటిని నివారించి విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యతను వెలికితీయడంతో పాటు, వారిలో మేథాసంపత్తిని ఎలా సాధించాలనే దానిపైన బ్రైంట్ మైండ్స్ ఏజెన్సీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. విద్యార్థుల్లో జ్ఞాపశక్తిని కూడా పెంపొందిస్తుంది. దీంతో పాటు విద్యార్థులకు ధాన్యం, యోగా తరగతులు నిర్వహిస్తాం. పట్టణాల్లో నిపుణులైన యోగా గురువులను ఆహ్వానిస్తాం. డీఈడీ చైతన్య జైనీ కూడా యోగా విద్యలో రాణించారు.
పరిపాలనలో మార్పులు...
జిల్లాలు విడిపోయిన తర్వాత నల్లగొండ జిల్లా పరిధి తగ్గింది. పరిపాలన పరంగా ఈ ఏడాదిలో సాధించిన విజయాలను పునఃపరిశీలిస్తాం. మండలస్థాయి నుంచి జిల్లా వరకు మార్పులు తీసుకరాబోతున్నాం. పరిపాలన పరంగా ఏడాదిలో గమనించిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఎక్కడైతే లోటుపాట్లు కనిపించాయో వాటిన్నింటిని సవరిస్తాం. మండల స్థాయిలో అక్కడకక్కడ కొన్ని గ్యాప్స్ కనిపించాయి. వాటిని పరిశీలిస్తున్నాం. పాలనపరంగా ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment