కష్టపడ్డా.. ఐఏఎస్ సాధించా..
♦ శ్రమించేతత్వం ఉంటే ఏ లక్ష్యమైనా అధిగమించవచ్చు
♦ బాలికల చదువుకు ప్రాధాన్యం
♦ ట్రైనీ ఐఏఎస్ ఆలె ప్రియాంక
సాక్షి, యాదాద్రి : కృషి, పట్టుదల సాధించాలన్న తపనకు అనుగుణంగా కష్టపడేతత్వం ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సునాయసంగా సాధించవచ్చని ట్రైనీ ఐఏఎస్ అధికారి ఆలె ప్రియాంక అన్నారు. బాలికలు ఉన్నత చ దువులు చదివి ఆర్థికంగా స్థిరపడిన రో జు ఎంతటి కష్టాలనైనా సునాయసంగా ఎదుర్కొవచ్చన్నారు. 2016 బ్యా చ్‌కు చెందిన ఆమె ఇటీవల జిల్లాకు వచ్చా రు. మూడు వారాలు జిల్లా కలెక్టరేట్‌లో వివిధ స్థాయిల్లో ఆమె శిక్షణ పొందను న్న ప్రియాంక ‘సాక్షి’కి ఇచ్చిన ఇం ట ర్వూ్యలో పలు అంశాలను వివరించారు.
సాక్షి : మీ కుటుంబ నేపథ్యం..?
ప్రియాంక : మా సొంత ఊరు రంగారెడ్డి జిల్లా ఉప్పల్. మా అమ్మానాన్నలు లోరా నారాయణ, డాక్టర్ నా రాయణ. మా నాన్న ఆయూష్ విభా గంలో ఆయుర్వేద డాక్టర్, మా అమ్మ సీసీఎంబీలో సీనియర్ ఇంజినీర్. నా భర్త డాక్టర్ మణిపాల్‌కుమార్. ఆయన మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
సాక్షి : మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?
ప్రియాంక : ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూలులో ఇంగ్లిష్ మీడియంలో సాగింది. ఇంటర్ కాకతీయ జూనియర్ కళాశాల ఎస్‌ఆర్ నగర్, ఎంబీబీఎస్ మహారాష్ట్రలోని ఎంజే సేవాగ్రామ్ మెడికల్ కళాశాలలో పూర్తి చేశాను.
సాక్షి : ఐఏఎస్‌కు ప్రేరణ ఎవరు?
ప్రియాంక : ఐఏఎస్ కావడానికి మా నాన్నే ప్రేరణ. ఆయన ఐఏఎస్ కావాలని అనుకున్నారు. కాని కొన్ని పరిస్థితుల వల్ల కాలేకపోయారు. డాక్టర్‌గా స్థిరపడ్డారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మా చెల్లెలు శశాంకతో కలిసి ఐఏఎస్‌కు సిద్ధమయ్యాం. అయితే 2014లో శశాంక ఐఏఎస్ సాధించింది. నాకు రాలేదు. అయినా పట్టువదలకుండా చదివి 2016 బ్యాచ్‌లో 529 ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాం. మా కుటుంబం నుంచి ఇద్దరు ఐఏఎస్‌లు కావడంతో మా అమ్మానాన్నలు చాలా సంతోషపడ్డారు. ప్రజలకు వీలైనంత ఎక్కువ సేవ చేయడానికి ఐఏఎస్ సరైనది అని భావించాను.
సాక్షి : ఐఏఎస్ ఎలా సాధించవచ్చు?
ప్రియాంక : ఐఏఎస్ కావాలని చాలా మంది కలలుకంటారు. కాని అందుకనుగుణంగా కష్టపడి చదవడంలో వెనుకబడిపోతారు. అందుకు అనేక కారాణాలు ఉండొచ్చు. కాని ఒక్కసారి ఐఏఎస్‌కు సిద్ధమైన వా రు అది రాకపోతే నిరుత్సాహంతో వదిలిపెట్టొద్దు. ఒకటికి రెండుసార్లు పరీక్షకు సిద్ధం కావా లి. అందుకోసం హర్డ్‌వర్క్ చేయా లి. అప్పుడు కచ్చి తంగా ఐఏఎస్ సాధించవచ్చు. ఐఏఎస్ సాధించాలనుకునే వారు కష్టపడేతత్వాన్ని పెంచుకోవాలి. నేను ఐఏఎస్ సాధించడంలో ఆర్.ఎస్ ప్రవీ ణ్‌కుమార్ ఐపీఎస్ ఎంతో సహకారం అందించారు.
సాక్షి : స్వరాష్ట్రానికి రావడం ఎలా ఉంది?
ప్రియాంక : ఐఏఎస్‌గా దేశమంతా సేవలందించే అవకాశం ఉన్నా స్వరాష్ట్రమైన తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. సొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. మాతృభూమిలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
సాక్షి : ఏ రంగంపై దృష్టిపెడుతారు?
ప్రియాంక : బాలికల చదువుపై ప్రత్యేక దృష్టి ఉంది. 8, 9 తరగతుల్లో డ్రాపౌట్ కాకుండా ఉన్నత చదువులు చదివితే మహిళలకు ఉద్యోగాలు వస్తాయి. దాంతో ఆర్థిక స్వావలంబన జరిగిన వారి అభివృద్ధి జరుగుతుంది. మహిళలు అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు.
సాక్షి : యాదాద్రి జిల్లా ఎలా ఉంది?
ప్రియాంక : యాదాద్రి భువనగిరి చాలా బాగుంది. ఇక్కడి అధికారులు కష్టపడి పనిచేస్తున్నారు. జిల్లాకు వచ్చి తక్కువ కాలమే అయినందున ఇంకా పూర్తిస్థాయిలో మండలాల్లో పర్యటించలేదు. జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉంది.