బీఎండబ్ల్యూతో ఢీ కొట్టి..తుపాకీతో బెదిరించి.. | 1 Dead In Noida BMW Hit-And-Run, Driver Flees Allegedly After Showing Gun | Sakshi

బీఎండబ్ల్యూతో ఢీ కొట్టి..తుపాకీతో బెదిరించి..

Published Sun, Apr 17 2016 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

బీఎండబ్ల్యూతో ఢీ కొట్టి..తుపాకీతో బెదిరించి..

బీఎండబ్ల్యూతో ఢీ కొట్టి..తుపాకీతో బెదిరించి..

బీఎండబ్ల్యూ కారుతో మరో కారు, బైక్ను ఢీకొట్టి అనంతరం తుపాకీతో బెదిరించి పారిపోయిన ఘటనలో ఒకరు మృతిచెందారు.

నోయిడా(ఢిల్లీ): బీఎండబ్ల్యూ కారుతో మరో కారు, బైక్ను ఢీకొట్టి అనంతరం తుపాకీతో బెదిరించి పారిపోయిన ఘటనలో ఒకరు మృతిచెందారు. నోయిడాలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న గుల్ఫామ్‌ అలీ (20) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. నోయిడాలోని సెక్టార్‌ 24లో ఏడవ గేట్ వద్ద బీఎండబ్ల్యూ కారు మరోకారుతో పాటూ బైక్ను శనివారం ఢీకొంది. ఈ ప్రమాదంలో గుల్ఫామ్‌ అలీ (20)తో పాటూ మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అలీ మృతి చెందగా.. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

బీఎండబ్ల్యూ కారు మరో కారుతో రేసింగ్‌ పెట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ కారు స్థానికంగా ఉండే నీతు అనే మహిళదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఘటన జరిగిన సమయంలో వినోద్‌ అనే వ్యక్తి కారును నడిపినట్లు నీతు తెలిపారు. కారును ఢీకొట్టిన అనంతరం వినోద్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు తుపాకీతో బెదిరించి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement