పూనెలో స్లాబ్ కూలి 10మంది మృతి | 10 labourers killed in Pune building slab crash | Sakshi
Sakshi News home page

పూనెలో స్లాబ్ కూలి 10మంది మృతి

Published Fri, Jul 29 2016 1:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

10 labourers killed in Pune building slab crash

పూనె: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం స్లాబ్ కూలి 10మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం పూనెలోని బలేవాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 14 అంతస్తుల భవన నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు  13 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. కాగా  భవనం శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పూనె మేయర్ ప్రశాంత్  మాట్లాడుతూ... ఈ సంఘటనను తాము తీవ్రమైన చర్యగా పరిగణిస్తామన్నారు. ఇందుకు బాధ్యలైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు భద్రతా చర్యలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ఇకనుంచి నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తనిఖీలు చేపడతామన్నారు.

మరోవైపు శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రైడ్ పర్పుల్ కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమానాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement