Under-construction building
-
చెన్నై: కూలిన నాలుగు అంతస్థుల భవనం
-
పూనెలో స్లాబ్ కూలి 10మంది మృతి
పూనె: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం స్లాబ్ కూలి 10మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం పూనెలోని బలేవాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 14 అంతస్తుల భవన నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు 13 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. కాగా భవనం శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పూనె మేయర్ ప్రశాంత్ మాట్లాడుతూ... ఈ సంఘటనను తాము తీవ్రమైన చర్యగా పరిగణిస్తామన్నారు. ఇందుకు బాధ్యలైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు భద్రతా చర్యలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై ఇకనుంచి నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తనిఖీలు చేపడతామన్నారు. మరోవైపు శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రైడ్ పర్పుల్ కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమానాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫిల్మ్ నగర్ క్లబ్ పై కేసు నమోదు
-
ఫిల్మ్‌నగర్‌లో కుప్పకూలి భవనం
-
ఫిల్మ్ నగర్ క్లబ్ పై కేసు నమోదు
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఫిల్మ్ నగర్ క్లబ్‌పై కేసు నమోదైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఇంజినీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావు, లేబర్ కాంట్రాక్టర్ రవిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఇద్దరు మరణించగా, మరో 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు 10కి పైగా నేలమట్టం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఫిల్మ్ నగర్ క్లబ్ ప్రకటించింది. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ రోజు సాయంత్రం ప్రమాద స్థలిని పరిశీలించారు. భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతిలేదని, బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఫిల్మ్ నగర్లో దుర్ఘటన
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు 10కి పైగా నేలమట్టం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు కూలీలు శిధిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఇరవై రోజులుగా ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఈ భవనానికి ఆనుకొని ఉన్న మరో బిల్డింగ్ సైతం పాక్షికంగా దెబ్బతింది. ఫిల్మ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గాయపడినవారిని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను సీతారాం, నర్సింహ, మహేంద్రప్ప, శివలింగప్ప, మల్లేష్, సిద్ధప్ప, హనుమంతు, కొండల్ రావు, మల్లిఖార్జునరావు, చెన్నయ్య, శ్రీను, కోటేష్లుగా గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి ఫిల్మ్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. మొదటి ఫ్లోర్ వేసిన 24 గంటల్లోనే రెండో ఫ్లోర్ వేయడం ఈ ప్రమాదానికి కారణమైనట్లు ఆయన తెలిపారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బిల్డింగ్ కూలిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
గోవాలో భవనం కూలి 13మంది మృతి
-
గోవాలో భవనం కూలి 14మంది సజీవసమాధి
పనాజీ: నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 14మంది కార్మికులు సజీవసమాధికాగా, 13మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పనాజీకి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కానకోనా టౌన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కానకోనాలో చ్వాదీ వార్డ్‌లో రూబీ రెసిడెన్సీ వద్ద మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. దాంతో సమాచరం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మురం చేశారు. శిధిలాల నుంచి ఇప్పటివరకూ 11మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ పర్యవేక్షణలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణంలో వున్న భవనం కింద 50మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శిధిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన 13మందిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రజా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ భవన నిర్మాణం నవాయి ముంబై ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్ధ నిర్మిస్తున్నట్టు తెలిసింది. భవనం కూలడానికి ఉపయోగించిన అణువులు నాశికరమైనవి కాబట్టే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి పారిక్కర్ అధికారులను అదేశించారు. దీంతో భవనం కాంట్రాక్టర్, మునిషిపల్ ఇంజినీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
గోవాలో భవనం కూలి 8మంది మృతి
పనాజీ: నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 8మంది కార్మికులు సజీవసమాధికాగా, 12మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పనాజీకి 80కిలోమీటర్ల దూరంలో ఉన్న కానకోనా టౌన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు .. కానకోనాలో చ్వాదీ వార్డ్‌లో రూబీ రెసిడెన్సీ వద్ద మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. దాంతో సమాచరం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మురం చేశారు. శిధిలాల నుంచి ఇప్పటివరకూ 8 మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రజా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నిర్మాణంలో వున్న భవనం కింద 40మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శిధిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.