పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం: 13మంది మృతి
పాట్నా: పెళ్లి బాజాలతో ఆనందంగా ఉన్న పందిరిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన శుక్రవారం బిహార్ ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13మంది అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వం రూ.4లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది.