రాంచీ: జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద కుట్రను ఛేదించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం సాయంత్రం 18 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది పాట్నా పేలుళ్లలో వాడిన బాంబులు మాదిరిగా ఇవి ఉన్నాయని ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ (అప్పటి ప్రధాని అభ్యర్థి) పాట్నాలో పాల్గొన్న ర్యాలీలో ఉగ్రవాదులు వరుస బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే.
నరేంద్ర మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబులు అమర్చేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి రాంచీలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో బాంబులు దాచిన సంగతి వెలుగులోకి వచ్చింది. నరేంద్ర మోడీ లక్ష్యంగా ఐదు నగరాల్లో బాంబు పేల్చేందుకు వ్యూహం పన్నామని, కాగా భారీ భద్రత కారణంగా సాధ్యంకాలేదని చెప్పారు.
రాంచీలో 18 బాంబులు స్వాధీనం
Published Sat, Jun 7 2014 8:11 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
Advertisement