బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా | 25 thousand fine if garbage fires in public | Sakshi
Sakshi News home page

బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా

Published Fri, Dec 23 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా

బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా

న్యూఢిల్లీ: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌(ఎన్ జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్‌ ప్రదేశాల్లోసహా ఎక్కడ చెత్తను దగ్ధంచేసినా వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధిస్తామని ఎన్ జీటీ స్పష్టంచేసింది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5,000 జరిమానా విధిస్తామని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది.

తమ మార్గదర్శకాలను పాటించాలంటూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్‌ జెండాలు, బ్యానర్‌ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖకు నోటీసులిచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement