Pollution prevention
-
వాస్తవిక దృక్పథంతో పారిశ్రామిక విధానం
గత ఐదేళ్లుగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ సుమారు రూ.4,800 కోట్లు పెండింగ్‌లో ఉంది.ఈ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కేటగిరీ వారీగా ఈ ఇన్సెంటివ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాలి. రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలి. ప్రతి పరిశ్రమ నుంచి వచ్చే పొల్యూషన్‌ను జీరో స్థాయికి తీసుకురావాలి. పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి, కాలుష్యం లేకుండా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుంది. సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక విధానం వాస్తవిక దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి.. పారిశ్రామిక కాలుష్య నివారణ, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు, పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్స్ చెల్లింపునకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై కోవిడ్–19 ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కాలుష్య నివారణకు పెద్దపీట ► సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా కాలుష్య నివారణ విధానం ఉండాలి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి. ► పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున, దీనిపై మరింతగా దృష్టి పెట్టాలి. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు తోడ్పాటు ► గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని మాటలు చెప్పి, చివరకు ఏదీ చేయని పరిస్థితి ఉండకూడదు. మనం చెప్పే మాటలపై పరిశ్రమలు పెట్టేవారికి విశ్వాసం ఉండాలి. ► పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇద్దాం. వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దాం. ► భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై వివరాలు తయారు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ – మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) మరింత తోడ్పాటునందించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. ► కోవిడ్–19 నేపథ్యంలో మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పుల కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్ధికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపై కసరత్తు చేయాలి. (కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని అంచనా వేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.) -
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా మంచి సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం సీఎం జగన్ ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్షలో భాగంగా పలు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం అవుతోందన్న ప్రజల అభ్యంతరాలను సీఎం ప్రస్తావించారు. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్ చేసే పద్ధతి వద్దని అధికారులను ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలని చెప్పారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. ఇటువంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. కాలుష్య నియంత్రణపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పారు. యురేనియం కంపెనీ అధికారులు, సంబంధిత ప్రజలు, కడప ఎంపీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోందని, ప్రజలకు కనీసం మంచి నీరు కూడా అందించలేకపోతే ఎలా అని ఆయన పశ్నించారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న తాగునీటి కష్టాలు చూశానన్నారు. నీరు కాలుష్యం బారిన పడకుండా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణకు కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. సమాజానికి చేటు తెచ్చే వాటిపై జవాబుదారీతనం ఉండాలని, విశ్వసనీయత ఉన్న ఏజెన్సీతో తాగునీటి పరీక్షలు చేయించి నీటి కాలుష్యం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధవళేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నీటిని తీసుకుని ప్రతి గ్రామంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు తీసుకుని పరిశ్రమ పెట్టకపోతే ఎలా? పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలో గత ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు(కలువపూడి శివ)కు ఇచ్చిన 350 ఎకరాల్లో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. 2016లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తే ఆయన ఆ భూమికి నామమాత్రపు ధర సుమారు రూ.ఏడు కోట్లు కూడా చెల్లించలేపోతే ఇంకా వందల కోట్లు పెట్టి పరిశ్రమలు ఎలా పెడతారని సీఎం ప్రశ్నించారు. మీరు చూసీచూడనట్టు వదిలేస్తే ఇదో ల్యాండ్ గ్రాబింగ్ అవుతుందని తప్పుబట్టారు. ఆయన ఏ పార్టీవారైందీ అనవసరమని, ఆ భూమిని తక్షణం వినియోగంలోకి తెచ్చి పరిశ్రమ పెడతారో? లేదో? తెలుసుకుని పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేఈ పవర్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి.. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చెందిన పవర్ ప్రాజెక్టు విషయంలో దాదాపు 150 కుటుంబాల వారు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నారని కర్నూలు జిల్లా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కేఈ ప్రాజెక్టు కోసం ఎస్సీ కుటుంబాలను బెదిరించి ఖాళీ చేయించారని, ప్రత్యామ్నాయం కూడా చూపలేదని అధికారులు ప్రస్తావించారు. దీనిపై పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడ సమస్యను పరిశీలించి అవసరమైతే ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేయొచ్చన్నారు. ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను రానివ్వరా? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను ఎందుకు అనుమతించడంలేదని, ఆలయాలకు, ఆశ్రమాలకు భక్తులను రానీయకుండా అడ్డుకుంటే ఎలా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు మంచిది కాదన్నారు. ఆలయాలు, ఆశ్రమాలు ఎక్కడికైనా భక్తులు వెళ్లేలా ఉండాలన్నారు. ఏదైనా అసాంఘిక శక్తులు అక్కడకు వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగించడం సరికాదని చెప్పారు. స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామంటే వినలేదు.. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి వారి ఆట కట్టించే చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వం అనుమతివ్వలేదని ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతరావు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. స్మగ్లింగ్‌లో తమిళనాడు, కర్ణాటక ముఠాలు ఉన్నాయన్నారు. అక్కడి ఎస్పీలతో తాను మాట్లాడానని, జాయింట్ ఆపరేషన్‌కు వారు అంగీకరించారన్నారు. అయితే ఎన్నికల ముందు అదనపు పోలీసు బలగాలను ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అనుమతించలేదని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పట్టుబడిన ఎర్రచందనం, వాహనాలు వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చాపర్ (హెలికాఫ్టర్) కావాలని గ్రేహౌండ్స్ ఏడీజీ నళిన్ ప్రభాత్ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల పని తీరును వివరించిన ఆయన చాపర్ అవసరాన్ని ప్రస్తావించారు. చాపర్ కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాద్దామని సీఎం జగన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి గ్రేహౌండ్స్ హెడ్ క్వార్టర్ మంజూరు చేసిందని, దాన్ని విశాఖపట్నం రూరల్ జిల్లాలో నిర్మించాలని నిర్ణయించినట్టు నళిన్ ప్రభాత్ చెప్పారు. అయితే అక్కడ అటవీ ప్రాంతం ఢి నోటిఫైడ్ చేయడంలో సాంకేతిక సమస్య రావడంతో ఇంత వరకు గ్రేహౌండ్స్ హెడ్‌క్వార్టర్ నిర్మాణం చేపట్టలేదన్నారు. -
భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. ఇక రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. -
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
-
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాల్లోసహా ఎక్కడ చెత్తను దగ్ధంచేసినా వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధిస్తామని ఎన్ జీటీ స్పష్టంచేసింది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5,000 జరిమానా విధిస్తామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. తమ మార్గదర్శకాలను పాటించాలంటూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ జెండాలు, బ్యానర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖకు నోటీసులిచ్చింది. -
‘కాలుష్యం’పై కట్టడి
- డీజిల్, ఇతర కాలుష్య వాహనాల నియంత్రణపై సర్కారు దృష్టి - ఢిల్లీ తరహాలో 15 ఏళ్ల పైబడిన వాహనాలపై నిషేధం? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీజిల్ వాహనాలు, ఇతర వాయు కాలుష్యకారక వాహనాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్ట నుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో వాహనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం మితిమీరి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం, జనజీవనం స్తంభించడంతో రాష్ట్రంలో జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం ఉన్నతస్థారుు టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఈ వాహనాలపై నిషేధించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ముందుగా రాష్ట్రంలో ఎన్ని డీజిల్ వాహనాలను వినియో గిస్తున్నా రు, వాటిలో 10 ఏళ్లలోపు, 15 ఏళ్ల లోపు, 20 ఏళ్లలోపు ఎన్ని ఉన్నాయన్న దానిపై సమాచా రాన్ని రవాణాశాఖ ద్వారా సేకరించాలని కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యా వరణ శాఖ మంత్రి జోగురామన్న ఆదేశించా రు. ముందుగా ఈ వాహనాలకు సంబంధిం చిన వివరాలను సేకరించాక తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. 50 మైక్రాన్లకన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లు ఉంటే చర్యలు... ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్న వాటిని రాష్ట్రంలో ఉత్పత్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కవర్లను దొంగదారిలో తరలించకుండా రవాణా-కమర్షియల్ టాక్స్ తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ కాకపోవడంతో వాటిని సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. కాలుష్య నివారణకు ప్రచార కార్యక్రమాలు రాష్ట్రంలో కాలుష్య నివారణకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కరపత్రాలు, మీడియా ఇతరత్రా రూపాల్లో ప్రచారానికి కార్యక్రమాలను రూపొందిం చాలని కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యారుు. కాలుష్యంపై నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాలను బలోపేతం చేసేందుకు, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణరుుంచింది. కాగా, కాలుష్యా ప్రాంతాల్లో పరిశ్రమల తనిఖీకి వీలుగా వాహనాలు కొనుగోలు చేయనుంది. -
‘కొత్త’ సవారీ...
కొత్త సంవత్సర వేళ.. పోలీసులు భిన్నమైన, స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్య నివారణకు, శారీరక దారుఢ్యానికి సైకిళ్ల వాడకంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విధి నిర్వహణలో వీలును బట్టి సైకిళ్లను వాడాలని నిర్ణయించారు. ఈ మేరకు నర్సాపూర్, రామాయంపేట ఠాణాల్లో నాలుగు చొప్పున సైకిళ్లను కొన్నట్టు ఈ రెండు స్టేషన్ల సీఐలు తిరుపతిరాజు, నందీశ్వర్ తెలిపారు. శుక్రవారం వీటికి హత్నూరలోని పలుగుమీది పోచమ్మ ఆలయంలో పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐలు గోపినాథ్, లాలునాయక్, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. - నర్సాపూర్ -
ఏడాదిన్నరలో కేన్సర్ ఆస్పత్రి సేవలు
- ఈ-వేస్ట్ మేనేజ్మెంట్, కాలుష్య నియంత్రణలపై అధ్యయనం - పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ వెల్లడి సాక్షి,విశాఖపట్నం: పెరుగుతున్న ఈ వేస్ట్‌మేనేజ్‌మెంట్, కాలుష్యనివారణ, వ్యర్ధాల శుద్ధిపై క్షేత్ర స్థాయిలో మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని సబార్డినేట్ లెజిస్లేషన్ పార్లమెంటరీ కమిటీ(రాజ్యసభ) చైర్మన్ డాక్టర్ సుబ్బిరామిరెడ్డి అన్నారు. పారిశ్రామిక,పోర్టు ఆధారిత నగరాల్లో రోజురోజకు పెరుగుతున్న కాలుష్యం, ఈ వేస్ట్‌ల నియంత్రణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం చేకూర్చిన వారమవుతామన్నారు. ఇందుకోసం రాజ్యసభలో చేసినచట్టాల అమ లు కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. శనివారం కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సుబ్బిరామిరెడ్డి స్థానిక నోవటల్లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రూ.400 కోట్లతో అణు ఇంధనసంస ్థద్వారా నిర్మిస్తున్న హూమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుందన్నారు. పోర్టు, పారి శ్రామిక కాలుష్యంతో సతమత మవుతున్న విశాఖను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేం దుకు రెండేళ్లలో 40లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటికే నగరంలో 14లక్షలమొక్కలు నాటారని అధికారులు చెబుతున్నారని చెప్పారు.మిగిలిన 26 లక్షలు మొక్కలు 2017కల్లా నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించామన్నారు. పోస్టులు భర్తీ చేయాలి.. కింజ్జార్జి ఆస్పత్రి స్థాయికి తగ్గట్టుగా సిబ్బందిలేదని, వెయ్యి మంది నర్సులు అవసరమైతే ప్రస్తుతం 250 మంది నర్సులు మాత్రమే ఉన్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సత్వరమే ఈ పోస్టులను భర్తీ చేసి ఈ ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలను మరింత మెరుగు పర్చాలన్నారు. కేజీహెచ్‌లో రూ.75కోట్ల సీఎస్ఆర్ నిధులతో కొత్త బ్లాకుల నిర్మాణ పనులు రెండు నెలల్లో మొదలవుతాయని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం కమిటీకి తెలిపారని, ఈ నిధులకు త్వరలో జఫాన్ నుంచి రాష్ట్రానికి మం జూరయ్యేనిధుల్లో రూ.300కోట్లు జతచేసి ఆస్పత్రిని సమగ్రాభివృద్ధి చేయాలని సూచించామన్నారు. విశాఖ రైల్వేస్టేషన్లో పారిశుద్య నిర్వహణ పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిందని,నాలుగుప్లాట్ఫారాల్లో నాలుగు ఎలివేటర్లు ఉన్నా యని, రెండు అదనంగా ఏర్పాటు చేస్తామని డీఆర్ఎం చంద్రశేఖ ముఖర్జి, తెలిపారని చైర్మన్ వివరించారు. తొలుత కమిటీ శనివారం కేజీహెచ్‌తో పాటు విశాఖ రైల్వేస్టేషన్‌ను పరిశీలించి రోగులు, ప్రయాణికులకు అందుతున్న సేవలను అడిగి తెలుసు కున్నారు. పర్యటనంతరం కమిటీ ఢిల్లీ పయనమైంది. పర్యటనలో కమిటీ సభ్యులు అవింద కుమార్‌సింగ్, డాక్టర్ కే రామలింగం, శంకరభాయ్, ఎన్.వెగాద్లతో పాటు పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆన్లైన్లో మొక్కలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :కాలుష్య నివారణకు, తరిగిపోతున్న వనాలపై దృష్టిసారించిన అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ ద్వారా మొక్కల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అటవీశాఖ వెబ్సైట్లో వ్యక్తుల పేర్లు నమోదు చేసి, ఆధార్ కార్డు నంబర్ జతచేస్తే ఆయా వివరాల ఆధారంగా మొక్కల పంపిణీ చేపట్టి వివరాల్ని ప్రభుత్వానికి పంపించనున్నారు. దీని ద్వారా ఎన్ని మొక్కలు పంపిణీ చేశామో... తెలుసుకోవడమేగాకుండా... మొక్కల పెంపకంపై అందరిలోనూ అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వెబ్సైట్లో మొక్కల పెంపకం వల్ల ఉపయోగాలు, భవిష్యత్ తరాలకు వాటి వినియోగం వివరాల్ని పొందుపర్చారు. ఇలా ప్రతి ఇంటా మొక్కలు నాటించాలన్న ఏకైక లక్ష్యంపై ఈ సారి ఎలాగైనా కనీసం 1.24కోట్ల మొక్కల్ని నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విద్యాసంస్థలు, స్వచ్చందసంస్థలు, పరిశ్రమల్లో మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధుల ద్వారా మొక్కల ధర మొత్తాన్ని రాబెట్టుకునేందుకు చూస్తున్నారు. విద్యా, ఇతర సంస్థలకు మాత్రం ఉచితంగానే పంపిణీ చేయనున్నారు. ఏటా జూలై 1 నుంచి వారోత్సవాలు నిర్వహించడం పరిపాటే. ఈ సారి పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 17నుంచి 66వ ‘వనమహోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ఆన్లైన్ సహా భారీ ఎత్తున మొక్కలు నాటించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారు? పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో చెట్లపై మరింత చైతన్యం కల్పించేందుకు వారినీ భాగస్వాములు చేయనున్నారు. మండల స్థాయి అధికారులు ప్రతి పాఠశాల, విద్యా సంస్థ వివరాలతో పాటు విద్యార్థుల పేర్లు, ఆధార్‌కార్డు నంబర్ వివరాలు కూడా రప్పించాలని జిల్లా యంత్రాంగం ద్వారా కోరారు. బయటి వ్యక్తులు ఆన్లైన్ ద్వారా మొక్కలు కోరితే 17వ తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చినా రిజిస్ట్రేషన్ ఫారం ఆధారంగా వివరాలు అందజేస్తామని భరోసా ఇస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మునిసిపల్ విభాగాన్ని భాగస్వామ్యం చేసేందుకు పలాస, పాతపట్నం, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం ప్రాంతాల రేంజ్‌ల్లో సుమారు 1.25లక్షల మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీరు అవసరం లేని వేప, నేరేడు, విప్ప, పూలమొక్కలు, పనస, చింత, రెల్ల, మామిడి, సరుగుడు, టేకు, జీడి మామిడి, కానుగ, బాదం, చెర్రీ తరహా అన్ని రకాల మొక్కల్నీ జిల్లాలోని 38 ప్రధాన పరిశ్రమల్లో ఒక్కో సంస్థ ఆవరణలో కనీసం 1000 మొక్కల్ని నాటించనున్నారు. ఇందుకోసం సంస్థ యాజమాన్యం నుంచి మొక్కల రుసుంను వసూలు చేయనున్నారు. జిల్లాలోని 282 వన సంరక్షణ సమితు(సామాజిక వన విభాగం)ల ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులతో మొక్కల పెంపకం చేపట్టనున్నారు. విత్తునాటితే... వీఎస్‌ఎస్‌ల ద్వారా మొక్కల పెంపకం చేపట్టి రిజర్వు ఫారెస్ట్ సహా అటవీభూముల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్న అటవీశాఖ వీటిపై కూడా మరో కొత్త ప్రయోగం చేపట్టనుంది. వేలాది టన్నుల విత్తనాల్ని రప్పించి వారం వ్యవధిలో భూమిలో పాతించి మొక్కల పెంపకం చూడాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో విత్తనం వేసి మొక్క తయారయ్యాక అడవుల్లో నాటేవారు. ఈసారి నేరుగా విత్తనాన్నే అటవీభూముల్లో వేయించేందుకు సిద్ధమయ్యారు. మొక్కల పెంపకంపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు, ప్రజల్లో అవగాహన మరింత పెంచేందుకు ఈ సారి వనమహోత్సవంలో విశేష కృషి చేపట్టినట్టు డీఎఫ్‌వో విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు. -
కాలుష్య నివారణకు సోలార్ సైకిల్
పింప్రి, న్యూస్‌లైన్ : మానవ సేవా వికాస్ ట్రస్టు సౌరశక్తితో నడిచే సైకిల్‌కు శ్రీకారం చుట్టింది. నగర కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్‌ను తయారు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వృద్ధులు, మహిళలు, స్కూలు విద్యార్థులు, వికలాంగులు సులువుగా ఈ సైకిల్‌పై ప్రయాణించవచ్చు. కేవలం నాలుగు గంటల ఛార్జింగ్‌తో 20 నుంచి 25 కి.మీ. దూరాన్ని ప్రయాణించవచ్చు. సౌరశక్తిపై నగర ప్రజలకు అవగాహన కలిగించేందుకు గత రెండేళ్లుగా ఈ సంస్థ సోలార్ సైకిల్‌ను తయారు చేస్తోంది. కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో 2012లో మానవ సేవా వికాస్ ట్రస్టు ఏర్పడింది. గ్రీన్ అండ్ క్లీన్ ప్రయాణం పేరిట ఈ-బైసైకిల్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సైకిల్లో 12 వోల్ట్ల శక్తిగల మూడు ఛార్జింగ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. నాలుగు గంటల పాటు వీటిని చార్జింగ్ చేస్తే 25 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్లాగానే తొక్కుకుంటూ కూడా వెళ్లవచ్చని రూపకర్తలు పేర్కొన్నారు. అయితే 35 కిలోల బరువున్న ఒక్కో సైకిల్ వెల సుమారు రూ.20 వేల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. వికలాంగుల కోసం మూడు చక్రాలతో, మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సైకిల్‌ను తయారు చేశారు. పింప్రి-చించ్వడ్లో ప్రస్తుతం 15 సైకిల్లు నడుస్తున్నాయి. ఈ-సైకిల్ ద్వారా ప్రతి రోజు సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ట్రస్టు అధ్యక్షులు సంతోష్ ఇంగలే తెలిపారు. ఈ సైకిల్ తయారీలో డిసిమోటర్, కంట్రోలర్, సోలార్ ఛార్జింగ్‌లు ఉన్నాయి. డిసిమోటర్ బెంగుళూరు నుంచి తీసుకురాగా, సౌరశక్తి ఛార్జింగ్ కోసం ప్యానెల్‌ను ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సైకిల్‌తో ధ్వని, వాయు కాలుష్యం జరగదు. సైకిల్ క్యారియర్, సీటు కింద బ్యాటరీని అమర్చారు. సంస్థ అధ్యక్షులు సంతోష్, ఉపాధ్యక్షులు వివేక్ కులకర్ణి, సునీల్ దేవ్‌లు సైకిల్ తయారీలో ముఖ్య పాత్ర పోషించారు.