‘కాలుష్యం’పై కట్టడి
- డీజిల్, ఇతర కాలుష్య వాహనాల నియంత్రణపై సర్కారు దృష్టి
- ఢిల్లీ తరహాలో 15 ఏళ్ల పైబడిన వాహనాలపై నిషేధం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీజిల్ వాహనాలు, ఇతర వాయు కాలుష్యకారక వాహనాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్ట నుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో వాహనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం మితిమీరి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం, జనజీవనం స్తంభించడంతో రాష్ట్రంలో జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం ఉన్నతస్థారుు టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఈ వాహనాలపై నిషేధించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ముందుగా రాష్ట్రంలో ఎన్ని డీజిల్ వాహనాలను వినియో గిస్తున్నా రు, వాటిలో 10 ఏళ్లలోపు, 15 ఏళ్ల లోపు, 20 ఏళ్లలోపు ఎన్ని ఉన్నాయన్న దానిపై సమాచా రాన్ని రవాణాశాఖ ద్వారా సేకరించాలని కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యా వరణ శాఖ మంత్రి జోగురామన్న ఆదేశించా రు. ముందుగా ఈ వాహనాలకు సంబంధిం చిన వివరాలను సేకరించాక తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది.
50 మైక్రాన్లకన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లు ఉంటే చర్యలు...
ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్న వాటిని రాష్ట్రంలో ఉత్పత్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కవర్లను దొంగదారిలో తరలించకుండా రవాణా-కమర్షియల్ టాక్స్ తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ కాకపోవడంతో వాటిని సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
కాలుష్య నివారణకు ప్రచార కార్యక్రమాలు
రాష్ట్రంలో కాలుష్య నివారణకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కరపత్రాలు, మీడియా ఇతరత్రా రూపాల్లో ప్రచారానికి కార్యక్రమాలను రూపొందిం చాలని కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యారుు. కాలుష్యంపై నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాలను బలోపేతం చేసేందుకు, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణరుుంచింది. కాగా, కాలుష్యా ప్రాంతాల్లో పరిశ్రమల తనిఖీకి వీలుగా వాహనాలు కొనుగోలు చేయనుంది.