ఏడాదిన్నరలో కేన్సర్ ఆస్పత్రి సేవలు
- ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్, కాలుష్య నియంత్రణలపై అధ్యయనం
- పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ వెల్లడి
సాక్షి,విశాఖపట్నం: పెరుగుతున్న ఈ వేస్ట్‌మేనేజ్‌మెంట్, కాలుష్యనివారణ, వ్యర్ధాల శుద్ధిపై క్షేత్ర స్థాయిలో మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని సబార్డినేట్ లెజిస్లేషన్ పార్లమెంటరీ కమిటీ(రాజ్యసభ) చైర్మన్ డాక్టర్ సుబ్బిరామిరెడ్డి అన్నారు. పారిశ్రామిక,పోర్టు ఆధారిత నగరాల్లో రోజురోజకు పెరుగుతున్న కాలుష్యం, ఈ వేస్ట్‌ల నియంత్రణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం చేకూర్చిన వారమవుతామన్నారు. ఇందుకోసం రాజ్యసభలో చేసినచట్టాల అమ లు కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.
శనివారం కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సుబ్బిరామిరెడ్డి స్థానిక నోవటల్‌లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రూ.400 కోట్లతో అణు ఇంధనసంస ్థద్వారా నిర్మిస్తున్న హూమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుందన్నారు. పోర్టు, పారి శ్రామిక కాలుష్యంతో సతమత మవుతున్న విశాఖను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేం దుకు రెండేళ్లలో 40లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటికే నగరంలో 14లక్షలమొక్కలు నాటారని అధికారులు చెబుతున్నారని చెప్పారు.మిగిలిన 26 లక్షలు మొక్కలు 2017కల్లా నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించామన్నారు.
పోస్టులు భర్తీ చేయాలి..
కింజ్‌జార్జి ఆస్పత్రి స్థాయికి తగ్గట్టుగా సిబ్బందిలేదని, వెయ్యి మంది నర్సులు అవసరమైతే ప్రస్తుతం 250 మంది నర్సులు మాత్రమే ఉన్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సత్వరమే ఈ పోస్టులను భర్తీ చేసి ఈ ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలను మరింత మెరుగు పర్చాలన్నారు. కేజీహెచ్‌లో రూ.75కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో కొత్త బ్లాకుల నిర్మాణ పనులు రెండు నెలల్లో మొదలవుతాయని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎల్‌వి సుబ్రహ్మణ్యం కమిటీకి తెలిపారని, ఈ నిధులకు త్వరలో జఫాన్ నుంచి రాష్ట్రానికి మం జూరయ్యేనిధుల్లో రూ.300కోట్లు జతచేసి ఆస్పత్రిని సమగ్రాభివృద్ధి చేయాలని సూచించామన్నారు.
విశాఖ రైల్వేస్టేషన్‌లో పారిశుద్య నిర్వహణ పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిందని,నాలుగుప్లాట్‌ఫారాల్లో నాలుగు ఎలివేటర్లు ఉన్నా యని, రెండు అదనంగా ఏర్పాటు చేస్తామని డీఆర్‌ఎం చంద్రశేఖ ముఖర్జి, తెలిపారని చైర్మన్ వివరించారు. తొలుత కమిటీ శనివారం కేజీహెచ్‌తో పాటు విశాఖ రైల్వేస్టేషన్‌ను పరిశీలించి రోగులు, ప్రయాణికులకు అందుతున్న సేవలను అడిగి తెలుసు కున్నారు. పర్యటనంతరం కమిటీ ఢిల్లీ పయనమైంది. పర్యటనలో కమిటీ సభ్యులు అవింద కుమార్‌సింగ్, డాక్టర్ కే రామలింగం, శంకరభాయ్, ఎన్.వెగాద్‌లతో పాటు పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.