ఒకరి తర్వాత మరొకరు మృత్యు ఒడిలోకి.. | 4 die after inhaling poisonous gas Jaipur | Sakshi
Sakshi News home page

ఒకరి తర్వాత మరొకరు మృత్యు ఒడిలోకి..

May 19 2016 7:26 PM | Updated on Sep 18 2018 7:36 PM

విషవాయువు పీల్చి నలుగురు మృతి చెందిన విషాద ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని సవేరా ప్రాంతంలో చోటు చేసుకుంది.

జైపూర్: విషవాయువు పీల్చి నలుగురు మృతి చెందిన విషాద ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని సవేరా ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుంటుంబానికి చెందిన వారున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  సవేరాకు చెందిన 12 ఏళ్ల జయప్రకాశ్ వాటర్ ట్యాంకులో పడిపోయాడు. అతడిని కాపాడడానికి వెళ్లిన సోదరుడు గజేంద్ర(24) కూడా అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు.

వారిని కాపాడడానికి వెళ్ళిన పొరుగింటాయన ప్రకాశ్(40) కూడా అక్కడ స్మృహ తప్పి పడిపోవడంతో ఆయన భార్య మీరా(35), కుమారుడు హరీంద్ర(18)లు కూడా అక్కడికి వెళ్లగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వారిని సమీపంలోని సవెరా ఆస్పత్రికి తరలించగా గజేంద్ర, ప్రకాశ్, మీనా, హరీంద్రలు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. జయప్రకాశ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. విషవాయువు పీల్చడం వల్లనే వారు మృతి చెందారని, కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement