బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 10 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ/పణజీ: రేపటి(శనివారం) నుంచి గోవాలో ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 10 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. రష్యా, భారత్‌ల వార్షిక సదస్సులో శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతారు. అదేరోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ భేటీ అయ్యే అవకాశముంది.
బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌తో సోమవారం సమావేశమవుతారు. బ్రిక్స్ సహ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ప్రధానులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరుపుతారు. మరోవైపు, బ్రిక్స్ సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. సదస్సు సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.