డాక్టర్‌ను చితకబాదిన పేషంట్‌ బంధువులు | a doctor being brutally assaulted at a government hospital at Dhule | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ను చితకబాదిన పేషంట్‌ బంధువులు

Published Tue, Mar 14 2017 10:43 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

డాక్టర్‌ను చితకబాదిన పేషంట్‌ బంధువులు

డాక్టర్‌ను చితకబాదిన పేషంట్‌ బంధువులు

ముంబై: ట్రీట్‌మెంట్ అందించడానికి నిరాకరించాడన్న కారణంతో ఓ డాక్టర్‌ను పేషంట్‌ బంధువులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన డాక్టర్‌ ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ధూలే పట్టణంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌(జీఎమ్‌సీ)కి ఆదివారం రాత్రి తలకు గాయమైన ఓ వ్యక్తిని ట్రీట్‌మెంట్‌ కోసం తీసుకొచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆసుపత్రిలో విధులు నిర్వర్విస్తున్న డాక్టర్‌.. పేషంట్‌ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పేషంట్‌ బంధువులు.. అతడిపై దాడికి దిగారు. రాడ్‌లు, చేతికందిన వస్తువులతో చితకబాదారు. ఆసుపత్రిని ధ్వసం చేశారు. ఈ ఘటనలో డాక్టర్‌ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను డాక్టర్ల అసొసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement