మోదీకి కేరళ అమ్మాయి సంచలన వీడియో
తిరువంతపురం: 'మోదీజీ.. సాయం చేయండి...స్పందించండి' అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాయడం, ట్విట్స్ చేయడం మనం గతంలో చాలా చూశాం కదా.. అయితే తాజాగా కేరళకు చెందిన ఓ విద్యార్థిని మోదీని ఉద్దేశించి రూపొందించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చెలరేగిపోతున్న డ్రగ్ మాఫియాను అంతంచేయాలంటూ మోదీన కోరిన వీడియో ఒకటి హల్చల్ గా మారింది. ఆరోగ్యకరమైన భారతదేశానికి బాటలు వేయాలంటూ కేరళ త్రిస్సూర్ జిల్లా కు చెందిన 10వ తరగతి అమ్మాయి ఆనీ రుబు జోషి (15) ఒక వీడియో తీసింది. మత్తుపదార్థాల దుష్ర్పభావాలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 6 నిమిషాల నిడివి వున్న ఈ వీడియోలో మత్తు మందులు, తీవ్రవాదం కంటే చాలా భయంకరమైనవనీ తెలిపింది. దీంతో ఆనీ కి మద్దతుగా వేల సందేశాలు వెల్లువెత్తాయి.
దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగ ఉన్నపుడే ,దేశం ఆరోగ్యంగా ఉంటుందని మీరే చెప్పారు. మరి మన చుట్టూ డ్రగ్ మాఫియా విస్తరించి ఉండగా.. దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించింది. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సమస్యల్ని సులభంగా పరిష్కరించవచ్చనీ, ఆ వైపు అడుగులుపడాలని ఆకాంక్షించింది. మందులు, మద్యం, పొగ ప్రభావాన్ని నిర్లక్ష్యం చేస్తే తీరని చేటు చేస్తుందని ఈ వీడియోలో పేర్కొంది. మత్తు మందులు చేస్తున్న కీడుపై తక్షణమే స్పందించాలని ప్రధానిని కోరింది.
లివర్ కాన్సర్ కారణంగా తన తండ్రిని పోగొట్టుకున్న కారణంగా, స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ -ఫార్ట్యూన్ అనే స్థానిక వేదిక ద్వారా తాను పోరాటం చేస్తున్నట్టుఆనీ తెలిపింది.