challenging
-
ఆ అంశాలతో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?
రాజస్థాన్‌లో అసెంబ్లీ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. ఇరుపక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రచారాలను హోరెత్తించాయి. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఒకదఫా బీజేపీ, మరోదఫా కాంగ్రెస్‌లు అధికారం చేపడుతూ వచ్చాయి. కానీ, ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ వేయాలని కాంగ్రెస్.. ఆ సంప్రదాయామే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్ అనుహ్యమైన రీతీలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి.. ప్రజలకు ఎన్నో రకాల వెల్ఫైర్ స్కీమ్‌లు అందించి మెజార్టీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్‌గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్‌గా మారి కాంగ్రెస్‌కి విజయాన్ని తెచ్చిపెడతాయా? విశ్లేషిస్తే.. రాజస్థాన్‌లో మరోసారి అధికారంలో పాగావేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు కొన్ని సవాళ్ల తోపాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్‌లో చరిత్రను తిరిగే రాసేలా.. కాంగ్రెస్ శతవిధాల యత్నించింది. కానీ ఆ ఆ పార్టీకి ప్రతికూలాంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. ఎగ్జామ్ పేపర్ లీకేజ్.. కాంగ్రెస్ నేతృత్వంలోని విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర లీకేజ్‌లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యావ్యవస్థ పరంగా కాంగ్రెస్‌కి అతి పెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్ లీక్ కుంభకోణం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్‌కి మైనస్ అయ్యి..ప్రజలు అధికారం పట్టకట్టాలా? లేదా అనే మీమాంసంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్గత విభేదాలు.. కాంగ్రెస్‌లో తరచుగా తెరపైకి అంతర్గత విభేధాలు తారస్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నువ్వా-నేనా? అనే స్థాయికి వచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్ బయటకు వచ్చి మరీ నిరాహారదీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయాలా చేశారు. చివరికి కాంగ్రోస్ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒకరంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అవినీతి, అల్లర్లు, నేరాలు.. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో జరిగిన అవతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గహ్లోత్ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరితంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అనుకూలమైన విషయాల వద్దకు వస్తే ఎన్నికలు సమీపిస్తుండగా ఒకరంటే ఒకరికి పడని గహ్లోత్, సచిన్ పైలట్ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలెట్ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పలా ఆయన ప్రవర్తన తీరు తోపాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్ వెల్ఫైర్ స్కీమ్‌లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్తరంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్‌పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్, కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుందా? వాటిల్లో కాంగ్రెస్‌కి ఎంతవరకు సానూకూల అంశాలు ఉన్నాయి అంటే.. సానూకూలమైన అంశాలు యునైటెడ్ ఫ్రంట్ అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు తామెప్పుడూ ఒకటేనని పార్టీని నిలబెట్లుకోవడమే లక్ష్యం అని ప్రకటించారు. అలాగే సచిన్ పైలట్ కూడా రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గహ్లోత్ ఒక్కరే అన్ని తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సంయమనాన్ని పాటించి సచిన్ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు. అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంత ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. పైగా గతంలో చేసిన వ్యాఖ్యల విషయం కూడా రాజకీయ పరంగా వచ్చినవే "క్షమించడం, మరచిపోవడం" అనే మంత్రాలని పాటిస్తున్నానంటూ నాయకులు ఐక్యతకు పీఠం వేశారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వొచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లును కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూలం అంశమే అని చెబుతున్నారు విశ్లేషకులు. గ్యారంటీల గేమ్ అశోక్ గహ్లోత్ ఓటర్లను ఆకర్షించేలా.. ఏడు గ్యారంటీలు, పాత పెన్షన్ స్కీమ్, మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకనేలా సుడిగాలిలో రాష్టం అంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్‌కి గెలుపులో కీలకం అవ్వోచని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానూకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్ గురి చేసింది. ఎలాంటి స్కీమ్, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలనే దిశగా అడగులు వేస్తూ గెలుపే లక్ష్యం దూసుకుపోతుంది. బీజేపీ వ్యూహం ఇలా.. ఇదిలా ఉండగా బీజేపీనేమో కాంగ్రెస్ మైనస్‌లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ తరుణంలో.. ఓటర్ తీర్పు.. అందునా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీదాకా వేచి చూడాల్సిందే. (చదవండి: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి! అమిత్ షా!) -
భారత్ ఎకానమీకి సమీపంలో సవాళ్లే!
సాక్షి, న్యూఢిల్లీ: సంస్కరణల అమల్లో బలహీనతలు, ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండడానికి కారణమవుతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయడింది. ఆయా సమస్యల వల్ల తన శక్తిసామర్థ్యాలకన్నా తక్కువ స్థాయిలో సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఫిచ్ విశ్లేషించింది. కోవిడ్–19 మహమ్మారితో స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సంస్కరణల అజెండా ఒకటని పేర్కొంది. సమీపకాలంలో భారత్ వృద్ధిబాటలో సంస్కరణల పటిష్ట అమలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొంది. అలాగే పెట్టుబడులు, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ వంటి అంశాల విషయంలో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషించింది. వ్యవసాయ రంగంలో మార్పులు వ్యవసాయరంగంలో తీసుకువచ్చే సంస్కరణల వల్ల ఈ రంగంలో సామర్థ్యం పెరుగుతుందని, మధ్యదళారీ వ్యవస్థతో పనిలేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారుకు విక్రయించగలుగుతారని పేర్కొంది. తద్వారా రైతులకు ఒకపక్క తగిన ఆదాయం లభిస్తుందని, మరోపక్క వినియోగదారులపై ధరాభారం తగ్గుతుందని వివరించింది. అయితే వ్యవసాయ సంస్కరణల అమల్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని ఫిచ్ విశ్లేషించింది. కార్మిక సంస్కరణలతో ప్రయోజనాలు ఇక కార్మిక మార్కెట్లో చట్ట సంస్కరణల వల్ల సామాజిక భద్రతా విషయంలో కార్మికుని పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ప్రయోజనాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడింది. వృతి పరమైన భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని వివరించింది. కార్మిక వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవడానికీ ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషించింది. చిన్న స్థాయి కార్మికులు వివిధ రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సంపాదించుకోగలుగుతారని పేర్కొంది. ఆయా సంస్కరణలు భారత్ కార్మిక మార్కెట్‌ను శక్తివంతంగా మలుస్తాయని వివరించింది. ‘‘సమీప కొద్ది సంవత్సరాల్లో కేంద్రం వివిధ రంగాల్లో పటిష్ట సంస్కరణల బాటలో పయనిస్తుందని ముము విశ్వసిస్తున్నాము. అయితే ఇదే సమయంలో అమలు విషయంలో మాత్రం క్లిష్ట పరిస్థితులు తప్పవని భావిస్తున్నాము’’ అని నివేదిక వరించింది. 2021-22లో 11 శాతం వృద్ధి 2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ 9.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం 11 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనావేసింది. 2018–19లో భారత్ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం. వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల 2019–20లోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.2 శాతానికి తగ్గిపోయింది. 2020–21లో కరోనాతో మాంద్యంలోకి జారిపోతున్న పరిస్థితి. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదవగా, సెప్టెంబర్‌లో ఈ క్షీణత 7.5 శాతానికి పరిమితమైంది. ద్వితీయార్థంలో ఎంతోకొంత వృద్ధి నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంశానికి సంబంధించి రాష్ట్రాలకు తీవ్రక్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్నాయని రేటింగ్, ఆర్థికవిశ్లేషణా సంస్థ క్రిసిల్ తన తాజా అధ్యయనం నివేదికలో తెలిపింది. స్థూల రాష్ట్రాల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 90 శాతం వాటా ఉన్న 18పెద్ద రాష్ట్రాల గణాంకాల పరిశీలన, విశ్లేషణ అనంతరం తాజా నివేదిక రూపకల్పన జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం. పన్ను వసూళ్లు క్రమంగా రికవరీ అవుతున్నప్పటికీ, అధిక వడ్డీరేట్ల సమస్య నెలకొనే పరిస్థితి ఉంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు చేసే రుణ సమీకరణలు ఇందుకు ఒక కారణం. ప్రభుత్వాలకు రెవెన్యూ వ్యయాల విషయంలో కూడా క్లిష్టపరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకపక్క వేతనాలు పెన్షన్లు, వడ్డీరేట్ల భారం మరోపక్క మహమ్మారి కరోనా కట్టడికి ఆరోగ్యరంగంపై అలాగే కార్మిక సంక్షేమానికి చేయాల్సిన వ్యయాలు ఈ విషయంలో నెలకొన్న క్లిష్టతకు మూలం. అధిక రెవెన్యూ లోటు పరిస్థితి రాష్ట్రాల మూలధన వ్యయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరిన్ని రుణలకు రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల మూలధన వ్యయాలు వచ్చే యేడాదికానీ పెరిగే పరిస్థితి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికికానీ, రెవెన్యూ ఆదాయాలు కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2021–22లో 10 శాతం జీడీపీ వృద్ధి జరుగుతుందని అంచనా. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని రేటింగ్ దిగ్గజం స్టాండెర్డ్ అండ్ పూర్స్ అనుబంధ పరిశోధనా విభాగం కూడా అయిన క్రిసిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ అంచనాలకు క్రితం 9 శాతం నుంచి 7.7 శాతానికి ఇప్పటికే మెరుగుపరచింది. అయితే ప్రభుత్వ వ్యయాల విషయంలో ఉన్న పరిమితులు వృద్ధికి అడ్డంకని తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి ద్రవ్యలోటు (కేంద్ర రాష్ట్రాలు కలిపి) ప్రస్తుత ఆర్థిక సంవతసరం 12 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలో ఉండే వీలుందన్న ఇక్రా అంచనాల నేపథ్యంలో తాజా క్రిసిల్ అధ్యయన నివేదిక వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 8.5 శాతానికి తగ్గవచ్చని ఇక్రా అంచనావేసింది. -
రాఫెల్ డీల్‌పై మోదీకి రాహుల్ సవాల్
సాక్షి, బెంగళూరు: రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానికి సవాల్ విసిరారు. తన ప్రశ్నలతో ఆయన ఒక్క సెకను కూడా నిలువలేరని చెప్పారు. సోమవారం కర్ణాటకలోని బీదర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘జన ధ్వని’ సభలో రాహుల్ ప్రసంగించారు. రూ.58వేల కోట్ల ‘రాఫెల్’ కాంట్రాక్టును అస్సలు అనుభవం లేని తన మిత్రుడు అనిల్ అంబానీకి చెందిన 10 రోజుల కంపెనీకి కట్టబెట్టారన్నారు. ఈ రంగంలో దిగ్గజమైన ప్రభుత్వరంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ను పక్కనబెట్టడంతో వేలాదిమంది యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారన్నారు. ‘ప్రధానికి దమ్ముంటే నా ముందుకు రమ్మనండి. నా కళ్లలోకి చూస్తూ ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు?.. ఎందుకంటే ఆయన కాపలాదారు (చౌకీదార్) కాదు.. వాటాదారు(భాగీదార్)’ అని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్ట్ కేసులో ఐటీ దర్యాప్తును ఆదేశించినందుకే రాహుల్ ప్రధానిపై అసత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. -
సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా
న్యూఢిల్లీ: తన ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఆధార్ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ నంబర్(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్బుక్, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్‌లో రిజిస్టర్ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్ ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టి కసి తీర్చుకున్నారు. -
ఆతిథ్య జట్టుతో ఆడటం సవాలే
స్పష్టమైన ఫేవరెట్ లేకుండా నాకౌట్ పోరు మొదలైంది. ఈ దశలో ఆట ఎప్పటికప్పుడు మారుతుంది. అయితే ఇక్కడ కొన్ని మ్యాచ్‌ల్లో విజేతలెవరో అంచనాకు రావొచ్చు. రష్యా కంటే స్పెయిన్, డెన్మార్క్ కంటే క్రొయేషియా మెరుగైన జట్లు కాబట్టి ఆ రెండు జట్లకు గెలిచే అవకాశాలుంటాయి. ఈసారి జర్మనీలాగే... 2010 చాంపియన్ స్పెయిన్ కూడా నాలుగేళ్ల క్రితం లీగ్ దశలోనే కంగుతింది. దీనికి కారణాలు కూడా ఒకలాగే ఉన్నాయి. విజేతలుగా నిలిచిన సమయంలో అనుభవజ్ఞులు బాగా ఆడారు. ఇప్పటి స్పెయిన్‌లో కొత్తగా వచ్చిన వాళ్లు చాలా ప్రతిభావంతులు. తాజా ఆలోచనలు... భిన్నమైన గేమ్ప్లాన్లతో దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇదే స్పెయిన్ జట్టును టాప్ గేర్‌లో దూసుకెళ్లెలా చేయొచ్చు. అలాగే... అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రష్యా ఆట కూడా చూడముచ్చటగా ఉంది. ఈ జట్టు తమదైన రోజు మేటి జట్లను ఘోరంగా దెబ్బతీస్తుంది. ప్రతిభపరంగా రష్యా మేటి జట్లకు దీటుగానే ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేతో ఎదురైన పరాజయం రష్యాను నిరాశపరిచి ఉండొచ్చు... కానీ లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య జట్టుతో మ్యాచ్ ఎలాంటి ప్రత్యర్థికైనా క్లిష్టమే! మరో మ్యాచ్ విషయానికొస్తే క్రొయేషియా పటిష్టమైన జట్టు. మోడ్రిక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అనుభవం, నైపుణ్యంతో ఈ జట్టు అదరగొడుతోంది. డెన్మార్క్‌ను ఓడించే సత్తా క్రొయేషియాకు ఉంది. -
మారన్ బ్రదర్స్‌కు సీబీఐ షాక్
సాక్షి,ముంబై: అక్రమ టెలిఫోన కనెక్షన్ల స్కాం లో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ కనెక్షన్ల స్కాంకు సంబంధించి మారన్ బ్రదర్స్ కళానిధి మారన్, దయానిధి మారన్‌లను స్పెషల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది. మారన్ బ్రదర్స్‌కు విముక్తి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో మారన్ బ్రదర్స్ సహా మరో ఏడుగురిని విడుదల చేసిన మూడు నెలల్లో (మార్చి, 14) సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ జి జయచంద్రన్ జూన్20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లు కేటాయించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి .దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్‌లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. బీఎస్ఎన్ఎల్ మాజీ జీఎం బ్రహ్మనాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలు స్వామి, దయానిధి వ్యక్తిగత కార్యదర్శి గౌతం ఇతర నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించిన సంగతి విదితమే. -
మోదీకి కేరళ అమ్మాయి సంచలన వీడియో
తిరువంతపురం: 'మోదీజీ.. సాయం చేయండి...స్పందించండి' అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాయడం, ట్విట్స్ చేయడం మనం గతంలో చాలా చూశాం కదా.. అయితే తాజాగా కేరళకు చెందిన ఓ విద్యార్థిని మోదీని ఉద్దేశించి రూపొందించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చెలరేగిపోతున్న డ్రగ్ మాఫియాను అంతంచేయాలంటూ మోదీన కోరిన వీడియో ఒకటి హల్చల్ గా మారింది. ఆరోగ్యకరమైన భారతదేశానికి బాటలు వేయాలంటూ కేరళ త్రిస్సూర్ జిల్లా కు చెందిన 10వ తరగతి అమ్మాయి ఆనీ రుబు జోషి (15) ఒక వీడియో తీసింది. మత్తుపదార్థాల దుష్ర్పభావాలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 6 నిమిషాల నిడివి వున్న ఈ వీడియోలో మత్తు మందులు, తీవ్రవాదం కంటే చాలా భయంకరమైనవనీ తెలిపింది. దీంతో ఆనీ కి మద్దతుగా వేల సందేశాలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగ ఉన్నపుడే ,దేశం ఆరోగ్యంగా ఉంటుందని మీరే చెప్పారు. మరి మన చుట్టూ డ్రగ్ మాఫియా విస్తరించి ఉండగా.. దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించింది. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సమస్యల్ని సులభంగా పరిష్కరించవచ్చనీ, ఆ వైపు అడుగులుపడాలని ఆకాంక్షించింది. మందులు, మద్యం, పొగ ప్రభావాన్ని నిర్లక్ష్యం చేస్తే తీరని చేటు చేస్తుందని ఈ వీడియోలో పేర్కొంది. మత్తు మందులు చేస్తున్న కీడుపై తక్షణమే స్పందించాలని ప్రధానిని కోరింది. లివర్ కాన్సర్ కారణంగా తన తండ్రిని పోగొట్టుకున్న కారణంగా, స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ -ఫార్ట్యూన్ అనే స్థానిక వేదిక ద్వారా తాను పోరాటం చేస్తున్నట్టుఆనీ తెలిపింది. -
పాసయ్యారు... కానీ..!
-
చర్చకు సై
గుజరాత్ అభివృద్ధిపై మోడీకి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ సవాల్ పలు రంగాల్లో ఆ రాష్ర్టం వెనుకబడింది మోడీ అబద్ధాలకోరు అందరినీ ప్రశ్నించడమే ఆయనకు తెలుసు ఏనాడూ ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించలేదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకునే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, విద్య సహా పలు రంగాల్లో ఆ రాష్ర్ట వెనుకబాటు తనాన్ని వెల్లడించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనిపై చర్చకు వస్తే తాము నిరూపిస్తామని సవాల్ విసిరారు. కేపీసీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార డీవీడీని విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ అబద్ధాలకోరని, అసత్యాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గుజరాత్ విద్యా రంగంలో దేశంలో 17వ స్థానంలో ఉందని, పౌష్టికాహార లోపంతో లక్షల మంది పిల్లలు బాధ పడుతున్నారని వివరించారు. పాఠశాలలకు పోకుండా నిలిచిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదనలో గుజరాత్ 10వ స్థానంలో ఉందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలపై రూ.లక్షా 76 వేల కోట్ల రుణ భారం ఉందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే... గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రమని మోడీ ఎలా అనగలుగుతున్నారని నిలదీశారు. ఆయనో అపాయకారి అని, అందరినీ ఆయన ప్రశ్నిస్తుంటారని, ఆయననెవరూ ప్రశ్నించకూడదని అన్నారు. బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు దంచడం మినహా, ఏనాడైనా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా అని నిలదీశారు. గుజరాత్ శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై కూడా చర్చ జరగలేదని తెలిపారు. -
ఏడుపిస్తున్న సీట్లు
ఆరింటికి టీడీపీ అభ్యర్థులు ఖరారు ఏడు చోట్ల ఎంపిక అసలైన సవాల్ అయోమయంగా పంచకర్ల భవితవ్యం గంటా తాజా ప్రతిపాదనతో నిరసనలు నేటి జాబితాయే కీలకం సాక్షి, విశాఖపట్నం : అభ్యర్థుల ఎంపిక టీడీపీని గందరగోళంలోకి నెట్టింది. పేర్లు ప్రకటిస్తే అసంతృప్తులు భగ్గుమంటారనే భయం నెలకొంది. అందుకే బుధవారం వివాదాల్లేని ఆరుచోట్ల అభ్యర్థులను ప్రకటించింది. వెలగపూడి(తూర్పు), రామానాయుడు(మాడుగుల), కేఎస్ఎన్ రాజు(చోడవరం), అయ్యన్న(నర్సీపట్నం), బండారు సత్యనారాయణమూర్తి(పెందుర్తి)ల పేర్లను ఖరారు చేసింది. రెండు సీట్లు బీజేపీకి కేటాయించగా ఇప్పుడు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న గంటా శ్రీనివాసరావుతోపాటు పంచకర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. తొలుత పంచకర్ల ఉత్తరం సీటు ఆశించగా పొత్తులో బీజేపీకి వెళ్లింది. పెందుర్తి స్థానం ఇస్తారని భావిస్తే తాజా జాబితాలో అక్కడ బండారును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పంచకర్ల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. చేసేది లేక అనకాపల్లి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. గంటా బృందం పరిస్థితి అటూ ఇటూ.. అనకాపల్లిలో ఓటమి భయంతో గంటా భీమిలి నుంచి పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కూడా పోటీకి పైరవీలు చేసుకుంటున్నారు. సకురు రఘువీర్, అప్పల నరసింహరాజు తదితరులు ఇప్పటికే పార్టీ బలోపేతం పేరుతో భారీగా ఖర్చుచేశారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి (సిట్టింగ్ ఎమ్మెల్యే) అవంతికి టికెటిస్తే ఓడిపోతారని పార్టీ సర్వేలో తేలడంతో ఇప్పుడాయన్ను అనకాపల్లి లోక్‌సభకు గంటా ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. అనకాపల్లి ఎమ్మెల్యేగా తన బృంద సభ్యుడైన పంచకర్ల పేరును తాజాగా గంటా సూచిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే స్థానికంగా ఆయా స్థానాల్లో చాలాకాలంగా పాతుకుపోయి పనిచేసుకుంటున్న టీడీపీ నేతల్లో అసమ్మతి పెల్లుబుకుతుందనే భయం పార్టీ వర్గాలను వెంటాడుతోంది. విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌లు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గాజువాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతపూడికి టికెట్ హామీలేకపోవడంతో కోన తాతారావు, పల్లా శ్రీనివాస్‌లు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. పాయకరావుపేటలో ఇన్చార్జి అనితకు వ్యతిరేకంగా క్యాడర్ నిప్పులు కక్కుతోంది. యలమంచిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు, సుందరపు విజయ్‌కుమార్, పప్పల చలపతిరావు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరూ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. అరకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు కాకుండా కుంభా రవిబాబుకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇదే జరిగితే అరకు నిరసనాగ్ని సెగలు రేగడం ఖాయమంటున్నారు. ఇలా ఏడు నియోజక వర్గాల్లో రకరకాల తలనొప్పులు పార్టీని వేధిస్తున్నాయి. గురువారం విడుదల చేయబోయే మలివిడత జాబితాలో దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. ఈ సీట్ల ప్రకటన తర్వాత చాలా నియోజక వర్గాల్లో పార్టీకి అసమ్మతి సెగలు తీవ్రమవనున్నాయి. సీటురాని వారిలో చాలామంది రెబల్ అభ్యర్థులుగా సైతం రంగంలోకి దిగడానికి నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. -
చంద్రబాబును ఎదిరిస్తారా!
పలమనేరు, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన విషయంలో మేం మా అధినేత్రి సోనియా గాంధీని ఎదిరిస్తాం.. మీరు మీ అధినాయకుడు చంద్రబాబునాయుడిని ఎదిరిస్తారా..? అంటూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ‘మీరసలే మంచి నటులు, రకరకాల వేషాలు వేసి సమైక్య రాష్ట్రం కోసం పాటుపడుతున్నారు.. ఇంకేదైనా ఓ వేషం వేసి మీ నాయకుడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకొనేలా చూస్తే బాగుంటుంది’ అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చురకలంటించారు. వి.కోటలో ఆదివారం జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవమున్న వ్యక్తికి రాష్ట్రం ముక్కలైతే జరిగే నష్టం తెలీదా..? అని బాబూనుద్దేశించి ప్రశ్నించారు. రాజకీయాలను బేరీజు వేసుకొని విభజన నిర్ణయాన్ని మార్చుకుంటే అందరూ సంతోషిస్తారని తెలిపారు. మేము రాష్ట్ర సమైక్యత కోసం సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, మీరూ మీ నాయకునిపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన లేఖను వెనక్కి తెప్పించాలని ఎంపీనుద్దేశించి అన్నారు.