దేశానికి సెక్యులరిజం అవసరమే: కనిమొళి | AAP win shows secularism still important to India: Kanimozhi | Sakshi
Sakshi News home page

దేశానికి సెక్యులరిజం అవసరమే: కనిమొళి

Published Tue, Feb 10 2015 4:25 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

దేశానికి సెక్యులరిజం అవసరమే: కనిమొళి - Sakshi

దేశానికి సెక్యులరిజం అవసరమే: కనిమొళి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం చూస్తుంటే దేశానికి  సెక్యులరిజం అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గారాల పట్టి కనిమొళి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ..''ఇది ఎవరూ ఊహించని ఫలితం. ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని, ఆప్ ఈ విధంగా ఎన్నికలను స్వీప్ చేయడం చూస్తుంటే సంప్రదాయ రాజకీయ పార్టీలు వారిని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.  అంతేకాకుండా దేశానికి సెక్యులరిజం అవసరం ఉందని తెలుస్తోంది'' అన్నారు. ఈ ఎన్నికలు నరేంద్రమోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా..ఆ విషయంపై మాట్లాడటం తొందరపాటే అవుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement