లంచం తీసుకుంటూ ఓ ఏసీపీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
జోదాపూర్: లంచం తీసుకుంటూ ఓ ఏసీపీ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదైన ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ. 70 వేల రూపాలయల లంచం తీసుకున్నందుగానూ ఏసీపీ అధికారిని శనివారం రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏసీబీ శాఖ కథనం ప్రకారం.. తూర్పు జోదాపూర్ ప్రాంతం (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఏసీపీ అధికారి జగదీశ్ కుమార్ విష్ణోయ్.. అట్రాసిటీ కేసులో ఇరుకున్న ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్లో నమోదు అయింది. ఎఫ్ఐఆర్ నుంచి ఆ వ్యక్తి పేరును తొలగించే విషయంలో మధ్యవర్తి ద్వారా ఏసీపీ రూ.70వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏసీపీని వలపన్ని పట్టుకున్నారు. కాగా లంచం తీసుకున్నట్టు నిర్థారణ కావడంతో ఏసీపీ అధికారి విష్టోయ్ను, మధ్యవర్తిగా వ్యవహరించిన దుంగార్దన్ ను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.