న్యూఢిల్లీ: గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయంలో తోబుట్టువులు లేదా భర్త తోడుగా ఉండేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రసూతి, శిశు మరణాలు తగ్గించేందుకుగాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్‌లోకి స్త్రీ బంధువును అనుమతించడం వల్ల ప్రసవ సమయంలో ఆమెకు ధైర్యంగా ఉంటుందని, దీనివల్ల ప్రసూతి, శిశు మరణాలు సంభవించే రేటు తక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లలో గర్భిణి భర్త ఉండేందుకు అనుమతిస్తున్నాయి.