సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇంకా ముమ్మర దశకు చేరుకోలేదని ఎయిమ్స్ డైరెక్ట్రర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. వివిధ రాష్ట్రాల్లో భిన్న సమయాల్లో మహమ్మారి ముమ్మర దశకు చేరుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ విజయవంతమైనా కరోనా వైరస్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ఉపకరించలేదని అన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేసుల సంఖ్య పెరుగుతుందని, మన జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఇతర ఐరోపా దేశాల పరిస్ధితితో పోల్చలేమని స్పష్టం చేశారు. యూరప్‌లో రెండు మూడు దేశాల జనాభాను కలిపినా మన జనాభా అధికమని గుర్తుచేశారు. ఆయా దేశాలతో పోలిస్తే మన వద్ద మరణాల రేటు చాలా తక్కువని అన్నారు.
కరోనా హాట్‌స్పాట్స్‌గా మారిన ఢిల్లీ, ముంబై నగరాల్లో సమూహ వ్యాప్తికి అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ సోకి స్వల్ప లక్షణాలున్నవారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి చికిత్స అవసరం లేదని, ఇంటి వద్దే కోలుకోవచ్చని చెప్పారు. తీవ్ర లక్షణాలున్నవారికి ఆస్పత్రిలో బెడ్స్‌ను అందుబాటులో ఉంచేందుకు లక్షణాలు లేని రోగులు ఇంటి దగ్గరే చికిత్స తీసుకోవాలని సూచించారు. లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం అవసరం లేదని ఆయన చెప్పారు. చదవండి : ఒక్కరోజే 206 కేసులు..
Comments
Please login to add a commentAdd a comment