నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని మెట్రో నగరాల మధ్య విమాన సర్వీసుల టికెట్ల ధరలకు డిస్కౌంట్ ఇచ్చింది.
డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 8 గంటల మధ్య దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిచే ఎయిరిండియా సర్వీసులలో అన్ని పన్నులతో సహా 5,016 రూపాయలతో ప్రయాణించవచ్చు. ఇక జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ-ముంబై మహానగరాల మధ్య ఎయిరిండియా బీ 777 విమానాల్లో ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్ల్లో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లను లక్కీ డ్రా తీస్తారు. విమానం టేకాఫ్ తీసుకునేముందు డ్రా తీస్తారు. విజేతను ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు.