సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆదేశంలో వైరస్ బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు. ఇటలీలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం నివారణ కోసం చాలా ప్రావిన్స్‌లను మూసివేసింది. దాంతో భారత్‌కు చెందిన వందలాదిమంది తెలుగు విద్యార్థులు ఇటలీలో చిక్కుకున్నారు. కరోనా భయంతో ఇండియాకు పయనమైన తెలుగు విద్యార్థులకు ఎయిర్ పోర్టులో చిక్కులు ఎదురయ్యాయి. చదవండి: పొరుగు ఇళ్లకు క్వారంటైన్ కష్టాలు
కరోనా వైరస్ లేనట్లు సర్టిఫికెట్ తేవాలంటూ ఎయిర్ పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు గత కొన్నిరోజులుగా అక్కడ చిక్కుకొని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ప్రత్యేక విమానంలో 263 మంది విద్యార్థుల్ని ఇటలీ రోమ్ నగరం నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తరలించారు. ఉదయం 9.15 గంటలకు విమానం దేశ రాజధానికి చేరుకుంది.
వీరికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇటలీలో వైరస్ ప్రభావంగా ఎక్కువగా ఉండటంతో అక్కడ్నుంచి వచ్చిన ఒక్కొక్క విద్యార్థికి క్షుణ్ణంగా టెస్టులు చేస్తున్నారు. వారిని తరలించేందుకు ప్రత్యేకంగా బస్సుల్ని తీసుకొచ్చారు. ఆ బస్సుల్లో మాత్రమే వారిని తీసుకెళ్లి క్వారంటైన్ చేయనున్నారు. చదవండి: విదేశీ ప్రయాణమే కొంపముంచిందా?
Comments
Please login to add a commentAdd a comment