సీఎం కోసం గంట ఆగిన విమానం | Air India Flight Delayed by Chief Minister Fadnavis' Aide | Sakshi
Sakshi News home page

సీఎం కోసం గంట ఆగిన విమానం

Published Tue, Jun 30 2015 8:01 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

సీఎం కోసం గంట ఆగిన విమానం - Sakshi

సీఎం కోసం గంట ఆగిన విమానం

ముంబై: వీఐపీ సంస్కృతి మరోసారి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోసం విమానాన్ని గంటసేపు ఆపారు.  మంగళవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఆలస్యంగా బయల్దేరింది. దీనిపై భిన్నకథనాలు వెలువడ్డాయి.

అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఫడ్నవిస్ బృందం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్ణీత సమయానికి చేరుకుంది. అయితే ఫడ్నవిస్ కొత్త పాస్పోర్టును మరిచిపోయి వచ్చినట్టు సమాచారం. ఫడ్నవిస్ సహాయకుడు ఆయన కొత్త పాస్ పోర్టు బదులు కాలంచెల్లిన పాస్పోర్టును పెట్టారు. దీంతో సీఎం నివాసం నుంచి కొత్త పాస్ పార్టును తెప్పించి బయల్దేరారు. కాగా సీఎం బృందంలోని అధికారి ప్రవీణ్ పరదేశి కాలం చెల్లిన పాస్పోర్టును తీసుకువచ్చినట్టు మరో కథనం. ఏదేమైనా పాస్పోర్ట్ తతంగం పూర్తయ్యేసరికి 50 నిమిషాల సమయం పట్టింది. అప్పటి వరకు ప్రయాణికులు వేచిచూడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement