సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నా కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. ఒంటరిగా బరిలోకి దిగుతారా? పొత్తు కొనసాగుతుందా? అనే విషయాలు ఎన్సీపీకి సీట్ల కేటాయింపుపై ఆధారపడి ఉంది. ఎన్సీపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ మొగ్గుచూపడం లేదు. ఈ నే పథ్యంలో ఎన్సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనే సంకేతాలను ఆ పార్టీ నాయకులు ఇస్తున్నారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 144 స్థానాలు కేటాయించాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది.
గత ఎన్నికలకంటే అధికంగా 10 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు మొండికేయడంతో ఇరుపార్టీల్లో సందిగ్ధత నెలకొన్నది. సీట్ల కేటాయింపు విషయం ఢిల్లీకి వెళ్లినా ఇంకా ఇరు పార్టీలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి. ఢిల్లీలో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, అహ్మద్ పటేల్, ఎ.కె.అంటోని తదితర నాయకుల మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసే పోటీచేయాలనే నిర్ణయానికొచ్చారు. కానీ సీట్ల సర్దుబాటుపై నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీ డిమాండ్ చేసిన 144 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా లేకపోవడంతో మరింత జాప్యం జరుగుతోంది.
ఒంటరిగా బరిలోకి దిగినా నష్టమేమీ లేదు: ఎన్సీపీ ఎంపీ ప్రపుల్ పాటిల్
కాంగ్రెస్, ఎన్సీపీ డీఎఫ్ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఇంతవరకు కొలిక్కిరాలేదని ఎన్సీపీకి ఎంపీ ప్రఫుల్ పాటిల్ చెబుతుఆన్నరు. తమ డిమాండ్లకు కాంగ్రెస్ నుంచి అనుకున్నంతమేర స్పందన రావడం లేదని, ఒంట రిగా బరిలో దిగేలా నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసినా...? ఒంటరిగా బరిలో దిగినా తమ పార్టీకి 50-60 స్థానాలు రావడం ఖాయమని ప్రఫుల్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2004లో జరిగిన శాసన సభ ఎన్నిల్లో ఎన్సీపీ 124 స్థానాల్లో పోటీ చేసింది.
2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోప్రాబల్యం తగ్గిపోవడంతో ఎన్సీపీ శాసన సభ ఎన్నికల్లో 114 స్థానాల్లో పోటీచేయాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలీస్తే ఎన్సీపీ ప్రాబల్యం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 144 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు పటేల్ వెల్లడించారు. 2009 కంటే 10 స్థానాలు ఎక్కువ అంటే 124 స్థానాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఎక్కువ స్థానాలు కావాల్సిందే..
ఎక్కువ స్థానాలు కావాలని కొందరు ఎన్సీపీ నాయకులు డిమాండ్ చే స్తున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్, ప్రదేశ్ అధ్యక్షుడు సునీల్ తట్కరేతో సహా అనేక మంది నాయకులు ఒంట రిగా బరిలో దిగాలని ఎన్సీపీపై ఒత్తిడి తెస్తున్నారు. ఒంటరిగా బరిలో దిగడం వల్ల శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని కాషాయకూటమి లబ్ధి పొం దుతాయి. కలిసి పోటీ చేయడం వల్ల తిరుగుబాట్ల బెడద ఉండదు. ఇలా రెండు విధాల ఎన్సీపీకి లాభనష్టాలున్నాయని పటేల్ అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు పొసగేనా?
Published Sun, Aug 24 2014 10:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement