
దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం
వారణాసి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభ స్థానం వారణాసి పరిధిలోని జోగియాపూర్ గ్రామంలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. రైతుల ర్యాలీలో పాల్గొనేందుకు అలహాబాద్ వెళ్తున్న షా ఆ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. దళిత వ ర్గానికి చెందిన గిరిజా ప్రసాద్ బిండ్ కుటుంబంతో కలిసి ఆయన నేలపై కూర్చొని మధ్యాహ్న భోజన ం చేశారని బీజేపీ మీడియా ఇంచార్జీ సంజయ్ భరద్వాజ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసే ఆయన దళితులతో భోజనం చేశారని యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ విమర్శించారు.