
రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల్ని సంప్రదిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్ష పార్టీల్ని తప్పకుండా సంప్రదిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని, తొలుత భాగస్వామ్య పార్టీలతో చర్చించిన అనంతరం విపక్షాలతో మాట్లాడతామని చెప్పారు. విపక్షాలతో ఏకాభిప్రాయాన్ని బీజేపీ కోరుకుంటుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఏకాభిప్రాయం అనే పదాన్ని వివిధ రకాలుగా వాడవచ్చని, బీజేపీ మాత్రం ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలతోను చర్చిస్తుందన్నారు.