
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ నేపథ్యంలో చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోకుండా పలువురు తమకు తోచిన ఆలోచనలతో ముందుకెళుతున్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తమ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ క్యాంటిన్లలో ప్లేట్లకు బదులు అరిటాకులను వడ్డిస్తున్నారని చేసిన ట్వీట్ పలువురిని ఆలోచనలో పడవేసింది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో అరటి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిటైర్డ్ జర్నలిస్టు పద్మా రామ్‌నాథ్ తనకు ఈమెయిల్ చేశారని చెప్పుకొచ్చారు.
ఈ సూచనతో తమ ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే ప్లేట్ల స్ధానంలో క్యాంటిన్లలో అరిటాకుల్లో భోజనం వడ్డించడం ప్రారంభించారని మహీంద్ర ఆ ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ను కేవలం గంట వ్యవధిలోనే 13,000 మందికి పైగా లైక్ చేశారు. చిన్న వ్యాపారాలకు సాయపడే ఆనంద్ మహీంద్రా సేవా తత్పరతను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment