ముంబై: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇమ్రాన్‌ఖాన్ అవగాహనా రాహిత్యాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన లాంటి ఉపాధ్యాయుడు తనకు పాఠాలు చెప్పనందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. జపాన్-జర్మనీలు రెండూ సరిహద్దు దేశాలు అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘దేవుడా! ఈ పెద్ద మనిషి(ఇమ్రాన్‌ఖాన్) నాకు చరిత్ర, భౌగోళిక శాస్త్ర టీచర్‌గా పాఠాలు చెప్పలేదు.. ఇంకా నయం’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రాథమిక విద్యార్థికున్నంత కనీస అవగాహన లేదని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జపాన్, జర్మనీ సరిహద్దు దేశాలు కాదన్న విషయం ఆయనకు తెలియకపోవడం విడ్డూమని వ్యాఖ్యానించారు. జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం, జర్మనీ ఐరోపాలో ఒక దేశం. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడాన్ని తప్పుబడుతున్నారు.
Thank you Oh Lord, for ensuring that this gentleman was not my History or Geography teacher...😊 pic.twitter.com/cIGxX0UdSh
— anand mahindra (@anandmahindra) August 25, 2019
Comments
Please login to add a commentAdd a comment